Devara:ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్.. దేవర నుంచి గ్లింప్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్.RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో భారీ హైప్స్ ఏర్పడ్డాయి. గతంలో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో దేవర సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

కొరటాల శివ కు కూడా ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అయితేనే కెరియర్ నిలబడుతుంది. అందుకే చాలా కష్టపడుతున్నారు. భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.. దేవర సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ (శ్రీదేవి కూతురు ) జాన్వీ కపూర్ నటిస్తోంది. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉండగా ఈ సినిమా మొత్తం సముద్రం బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ డ్రామా గా తెరకెక్కిస్తున్నారు.

ఎన్టీఆర్ ఇందులో గంగమ్మ తల్లి భక్తుడుగా కనిపించబోతున్నారట. అందుకు సంబంధించి షూటింగ్ కూడా జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం మొత్తానికి కూడా ఇదే హైలైట్ గా నిలవబోతుందని చిత్ర బృందం చాలా ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. దేవర సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేవర సినిమాకి సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.

- Advertisement -

దేవర సినిమాకి సంబంధించి గ్లింప్స్ గురించి ఒక న్యూస్ వినిపిస్తోంది. జనవరి 8వ తేదీన ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సిద్ధం అయిందని టాక్ నడుస్తూ ఉండగా.. ఈ విషయం పైన చిత్ర బృందం త్వరలోనే ఒక అధికారికంగా ప్రకటన కూడా తెలియజేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దేవర సినిమాకి సంబంధించి పలు రకాల పోస్టర్లు సైతం విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఏది ఏమైనా ఈ విషయం ఎన్టీఆర్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చే న్యూస్ అని చెప్పవచ్చు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు