Devara : టీజర్ పోస్ట్ పోన్? ఇదెక్కడి బ్యాడ్ న్యూస్ దేవరా?

తారక్ హీరోగా నటిస్తున్న “దేవర” టీజర్ వాయిదా పడబోతోందా? అసలు కొరటాల శివ ప్లాన్ ఏంటి? టీజర్ రిలీజ్ కు అడ్డుగా వచ్చిన అంశం ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తాజా చిత్రం “దేవర“. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ తో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీలో ఎన్టీఆర్ తో హోరాహోరీగా తలపడనున్న విలన్ గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ తో కలిసి యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న దేవర మూవీ ఫస్ట్ పార్ట్ ను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. వేసవికాలం సెలవులను క్యాష్ చేసుకోవడానికి మేకర్స్ ముందుగానే ప్లాన్ చేశారు. ఇదంతా బాగానే ఉంది గానీ తాజాగా జరుగుతున్న ప్రచారమే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను టెన్షన్ పడుతోంది. దానికి కారణం “దేవర” టీజర్ రిలీజ్ ప్లాన్ వాయిదా పడింది అంటూ వస్తున్న వార్తలే.

నిజానికి “దేవర” టీజర్ ను డిసెంబర్ 20న రిలీజ్ చేయాలని టీం ప్లాన్ చేసింది. అంతేకాకుండా ఆ టీజర్ ను డిసెంబర్ 22న పెద్ద ఎత్తున రిలీజ్ కాబోతున్న “సలార్”, “డుంకి” థియేటర్ల స్క్రీన్స్ కి అటాచ్ చేయాలని ఆలోచనలో “దేవర” టీం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త బయటకు రావడంతో తమ అభిమాన హీరో చేస్తున్న కొత్త సినిమా టీజర్ త్వరలో రిలీజ్ కాబోతుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరపడ్డారు. కానీ ఆ సంబరం ఎక్కువ రోజులు నిలవలేదు. అనుకున్న ప్రకారం ప్లాన్స్ జరగకపోవడంతో “దేవర” టీజర్ రిలీజ్ ప్లాన్ వాయిదా పడినట్టు సమాచారం.

- Advertisement -

“దేవర” కథకు కీలకమైన విజువల్ ఎఫెక్ట్స్ కి టీం ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే విఎఫ్ఎక్స్ ఆలస్యం కావడంతోనే టీజర్ అనుకున్న సమయానికి రావట్లేదని అంటున్నారు. ఈ సినిమా అప్డేట్ కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం “దేవర” టీజర్ గనుక నిజంగా వాయిదా పడితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరికొంత కాలం వేచి చూడక తప్పదు. ఆ తర్వాత మేకర్స్ పరిగణలోకి తీసుకునేది సంక్రాంతిని మాత్రమే. ఇప్పుడు మిస్ అయితే “దేవర” టీజర్ సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి టీజర్ పోస్ట్ పోన్ వార్తలు నిజమైతే, సంక్రాంతి దాకా తారక్ ఫ్యాన్స్ వెయిట్ చేయక తప్పదు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు