Salaar : “సలార్” థియేటర్లలో “ఈగల్”… ఇలాగైనా రవితేజకు కలిసొస్తుందా?

దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “సలార్” డిసెంబర్ 22న థియేటర్లలోకి రాబోతోంది. ఈ మూవీ థియేటర్లలోని రవితేజ “ఈగల్” మూవీని ప్రమోట్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. మరి “సలార్” థియేటర్స్ రవితేజ గెట్ బ్యాక్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయా? ఇలా చేయడం వల్ల రవితేజకు కలిసొస్తుందా? అంటే…

ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజకు ఇండస్ట్రీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వరుస ప్లాపులతో సతమతం అవుతున్న ఈ హీరో మార్కెట్ చాలా దారుణంగా ఉంది. దీంతో మైత్రి మూవీ మేకర్స్ వంటి కొంతమంది బడా నిర్మాతలు ఈ హీరోను ఏకంగా పక్కన పెట్టేశారు. ఇక నెక్స్ట్ రవితేజ చేయబోయే రెండు సినిమాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. అది కూడా ఈ హీరో తన రెమ్యూనరేషన్ ను తగ్గించుకుంటేనే ఆ రెండు సినిమాలు పట్టాలెక్కే అవకాశం ఉంది. కానీ రవితేజ మాత్రం తన పారితోషికాన్ని తగ్గించుకునే ఆలోచనలో లేడట. ప్రస్తుతం ఆ రెండు కొత్త ప్రాజెక్టులకు సంబంధించి పారితోషకం విషయంలో రవితేజతో నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే రవితేజ “ఈగల్” మూవీ రిలీజ్ కు రెడీ అవుతుంది.

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న కొత్త మూవీ “ఈగల్”. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ రవితేజతో రొమాన్స్ చేయబోతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్ సినిమా పై ఆసక్తిని అమాంతం పెంచేశాయి. కానీ రవితేజ నటించిన గత చిత్రం టైగర్ నాగేశ్వరరావు విషయంలో కూడా ఇలాగే జరిగింది. రిలీజ్ కు ముందు ఆ మూవీపై కూడా టీజర్, ట్రైలర్లతో భారీ అంచనాలు పెంచేశారు. కానీ తీరా థియేటర్ కెళ్ళి చూస్తే ఆ మూవీ ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. ప్రస్తుతం “ఈగల్” మూవీ విషయంలో కూడా అలాగే జరుగుతుంది. దీంతో “ఈగల్” మూవీని నిర్మిస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు ఈ మూవీ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట.

- Advertisement -

డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్” మూవీని ప్రదర్శించే థియేటర్లలో “ఈగల్” ట్రైలర్ ను వేయాలని ప్లాన్ చేస్తున్నారట నిర్మాతలు. ఈ విధంగా పాన్ ఇండియా స్టార్ట్ ప్రభాస్ ను వాడుకుని గట్టెక్కాలని చూస్తున్నాడు రవితేజ. మరి వీళ్ళ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. ఇక “ఈగల్” మూవీనీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు