OG : ఓజీ మూవీ లేనట్టేనా? పవన్ ఫ్యాన్స్ ను నిరాశలో ముంచేసిన డివివి అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “ఓజి” మూవీ ఇక లేనట్టేనా? నిర్మాత డివివి ఇచ్చిన తాజా అప్డేట్ ఏంటి? ఆ అప్డేట్ పవన్ ఫ్యాన్స్ ను ఎందుకు నిరాశలో ముంచేసింది? అంటే…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజకీయాలకు ప్రాధాన్యత పెరగడంతో పాటు త్వరలో ఏపీలో జరగనున్న ఎలక్షన్స్ కోసం పవన్ కొన్నాళ్లు సినిమాలను పక్కన పెట్టేశారు. జనసేన ని ప్రస్తుతం తన దృష్టిని పూర్తిగా ఎన్నికలపైనే పెట్టాడు. ఈ నేపథ్యంలో పవన్ కోసం వెయిట్ చేసి చేసి విసిగి వేసారి పోతున్నారు దర్శకులు. ఇప్పటికే ఆయనతో సినిమాలు కమిట్ అయిన డైరెక్టర్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్, క్రిష్ జాగర్లమూడి వంటి దర్శకులు ఆయన బాధితులుగా మారిపోయారు. హరీష్ శంకర్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ కోసం చాలా సమయాన్ని వేస్ట్ చేసుకున్నాడు.

అయినప్పటికీ ఓపిగ్గా పవన్ కోసం వెయిట్ చేస్తూనే, ఆయన సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేలోపు మరో మూవీ చేయాలని ప్లాన్ చేశాడు. ఇక హరిహర వీరమల్లు సినిమాను ప్రకటించి చాలా కాలం అయినా, ఆ మూవీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. నిజానికి ఈ సినిమా ఆగిపోయింది అనే రూమర్లు టాలీవుడ్ లో వినిపిస్తూ ఉన్నాయి. ఈ సినిమాలు స్టార్ట్ అయ్యాకే త్రివిక్రమ్ సలహాతో స్టార్ట్ చేసిన భీమ్లా నాయక్, బ్రో సినిమాలను పవన్ కళ్యాణ్ పూర్తి చేయడం, రిలీజ్ కావడం కూడా అయిపోయింది. కానీ హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్, క్రిష్ హరిహర వీరమల్లు సినిమాలకు మాత్రం మోక్షం లభించలేదు.

- Advertisement -

ఇక పవన్ హీరోగా తెరకెక్కుతున్న మరో క్రేజీ మూవీ “ఓజి”. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అప్డేట్స్ గురించి పవన్ ఫాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమాను నిర్మిస్తున్న డివివి ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ పవన్ ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశలో ముంచేసింది. ” బర్త్ డే విషెస్ తో టైం లైన్ ఫుల్ అయిపోయింది. సాధారణంగానే అభిమానులు ఫుల్ హంగ్రీ గా ఉంటారు. కాబట్టి ఇది మీకు తెలియాలని చెబుతున్నాం. ప్రస్తుతం మూవీ షూటింగ్ జరగడం లేదు.

కాబట్టి అప్డేట్లు రావాలంటే టైం పడుతుంది. డోంట్ స్టే ట్యూన్డ్ హియర్” అని డివివి సంస్థ ట్వీట్ చేసింది. ఇదంతా చూస్తుంటే “ఓజి” మూవీ మళ్లీ పట్టాలెక్కడానికి ఎంత టైం పడుతుంది అనే విషయంలో నిర్మాతలకు కూడా క్లారిటీ లేనట్టుగా కనిపిస్తోంది. మరి అసలు మూవీ పూర్తవుతుందా? లేదంటే పూర్తిగా పక్కన పెట్టేస్తారా? అనే గందరగోళం నెలకొంది పవర్ స్టార్ ఫ్యాన్స్ లో. ఇక డివివి ట్రీట్ చూసిన పవన్ అభిమానులు ఓ జి అప్డేట్ ఇవ్వకపోతే నీ అకౌంట్ లేపేస్తాం అంటూ ఫన్నీ గా వార్నింగ్ ఇస్తున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు