Charith Manas మహేష్ కి తగ్గ అల్లుడే.. అదరగొట్టేసాడుగా..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు.ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు మహేష్ బాబు బావ ప్రముఖ హీరో సుధీర్ బాబు కూడా అందరికీ పరిచయమే.. ఈయన కూడా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నారు. కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక సుధీర్ బాబుకు ఇద్దరు కొడుకులు కాగా అందులో పెద్ద కుమారుడు చరిత్ మానస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.

అయితే చరిత్ మానస్ ని చూస్తే మాత్రం అచ్చం మహేష్ బాబు లాగే ఉంటాడు. మేనమామ పోలికలతో పుట్టిన చరిత్ ఇప్పుడు మామకు తగ్గ అల్లుడు అనిపించుకుంటున్నారు . వాస్తవానికి మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ తన తాతయ్య కృష్ణ పోలికలతో జన్మించారు. అయితే మహేష్ బాబు పోలికలతో సితార కూడా జన్మించలేదు. కానీ అల్లుడు చరిత్ అచ్చం తన మేనమామ పోలికలతో ఉండడంతో అందరూ జూనియర్ మహేష్ అంటూ పెద్ద ఎత్తున అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఇక మహేష్ బాబు తర్వాత అంత గ్లామరస్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మహేష్ అల్లుడు చరిత్ మానస్ అంటూ చెబుతూ ఉంటారు.

ఇదిలా ఉండగా తాజాగా చరిత్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని పంచుకున్నాడు. అందులో పార్క్ అవర్ ఫ్లో అంటూ పెద్ద ఎత్తున వర్కౌట్స్ చేస్తూ ఉన్నటువంటి ఒక వీడియోని చరిత్ మానస్ సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో చూసినటువంటి చాలామంది అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు మహేష్ బాబు అల్లుడా మజాకా అచ్చం మహేష్ బాబు ని గుర్తు చేస్తున్నాడు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.మహేష్ తర్వాత అలాంటి సూపర్స్టార్ హీరో చరిత్ అవుతాడు.. ఒక సినిమా చెయ్యి తర్వాత మేము నీకు సూపర్ హిట్లు అందిస్తాము అంటూ మహేష్ బాబు అభిమానులు చరిత్ కు సపోర్టుగా నిలుస్తున్నారు. ఏది ఏమైనా మామకు తగ్గ అల్లుడుగా పేరు దక్కించుకుంటున్నాడు చరిత్. మరి హీరో గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తే ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు