Maheshbabu: మహేష్ బాబు డ్రైవర్ శాలరీ తెలిస్తే నోరెళ్ళ బెట్టాల్సిందే..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. మొన్నటి వరకు కేవలం తెలుగు చిత్రాలలోనే నటించి తెలుగుపై తనకున్న మక్కువని చాటిన మహేష్ బాబు తాజాగా పాన్ ఇండియా లెవెల్ లో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో అడ్వెంచర్ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నారు మహేష్ బాబు.. ఈ సినిమాతో ఏకంగా హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మరోవైపు ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదలకు సిద్ధం చేస్తున్నారు చిత్ర బృందం.

జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక త్రివిక్రమ్ , మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఇలా వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న మహేష్ బాబుకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ముఖ్యంగా మహేష్ బాబు పర్సనల్ కార్ డ్రైవర్ శాలరీ గురించి ఒక వార్త హల్చల్ చేస్తోంది. మహేష్ బాబు తన వ్యక్తిగత కారు డ్రైవర్ నెలకి 5 లక్షల రూపాయల శాలరీ ఇస్తారని సమాచారం. అంతే కాదు ఈయన కేవలం మహేష్ బాబుకు మాత్రమే కాకుండా నమ్రతాకి కూడా వ్యక్తిగత డ్రైవర్ గా పనిచేస్తున్నారట.

అందుకే ఈయనకు నెలకు 5 లక్షల రూపాయల జీతం ఇస్తున్నట్లు సమాచారం. ఇలా నెలకు 5 లక్షల రూపాయల జీతం అంటే ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి కూడా ఈ రేంజ్ లో శాలరీ ఇవ్వరనే చెప్పాలి. అలాంటిది మహేష్ బాబు తన వ్యక్తిగత డ్రైవర్ కి ఈ రేంజ్ లో సాలరీ ఇస్తూ ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఇక మహేష్ బాబు మాత్రమే కాదు రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి హీరోలందరూ కూడా తమ పర్సనల్ డ్రైవర్లకు ఇంతే రేంజిలో పారితోషకం ఇస్తున్నారని సమాచారం. ఇక ఏది ఏమైనా ఒక కారు డ్రైవర్ నెల జీతం రూ.ఐదు లక్షల అంటే అందరూ ఆశ్చర్య పోతున్నారు.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు