Tollywood : ఇప్పుడు ఏ హీరో ఎక్కడ ఉన్నాడో తెలుసా?

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోలంతా ఎవరికి వారు తమ తమ సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఏ స్టార్ హీరోని కదిపినా తమ సినిమా షూటింగ్ సెట్లోనే ఉంటున్నారు. ఈ గజిబిజి షెడ్యూల్స్ లో సినిమాను పూర్తి చేయడమే లక్ష్యంగా రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్నారు. తమ ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి ఆమాత్రం కష్టం తప్పదు కదా. మరి టాలీవుడ్ టాప్ హీరోలంతా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

విజయ్ దేవరకొండ తాజా చిత్రం “ఫ్యామిలీ స్టార్”. ఇటీవల ఢిల్లీలో ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా, అమెరికాలో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరో రెండు మూడు రోజుల్లో టీం అమెరికాకి బయలుదేరే ఛాన్స్ ఉంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు విషయానికి వస్తే ఆయన “గుంటూరు కారం” సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతానికి హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. మహేష్ బాబు, మీనాక్షి చౌదరి లపై ఓ సాంగును అక్కడ తెరకెక్కిస్తున్నారు.

- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప 2” షూటింగ్ సెట్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఖైరతాబాద్ లో జరుగుతోంది. అయితే “పుష్ప 2” షూటింగ్ ఏకకాలంలో రెండు చోట్ల జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. రామోజీ ఫిలిం సిటీ లో ఒక టీం షూట్ చేస్తుండగా, మరో టీం ఖైరతాబాద్ లో కవర్ చేస్తున్నారట. అయితే అల్లు అర్జున్ అనారోగ్యం కారణంగా షూటింగ్ కి బ్రేక్ ఇవ్వడంతో, ఆయన లేని సన్నివేశాలపై ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతుంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ “గేమ్ చేంజర్” మూవీ షూటింగ్ మైసూర్ లో జరుగుతుంది. తాజాగా తెలంగాణ ఎలక్షన్స్ లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి హైదరాబాద్ వచ్చిన రామ్ చరణ్ మళ్ళీ షూటింగ్ లో జాయిన్ అయిపోయారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “దేవర” అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతానికి శంషాబాద్ లో నిర్మించిన ఓ భారీ సెట్ లో జరుగుతుంది. సినిమాకు సంబంధించిన కీలకమైన ఘట్టాలను అక్కడ షూట్ చేస్తున్నారు.

ఇక యంగ్ హీరో శర్వానంద్ ‘మనమే’ మూవీ షూటింగ్ కోసం లండన్ లో ఉన్నారు. మంచు విష్ణు ‘కన్నప్ప’ టీంతో న్యూజిలాండ్ లో బిజీగా ఉన్నారు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు