Vijay Antony: బిగ్ బాస్ బ్యూటీతో పెళ్లికి సిద్ధమైన విజయ్ ఆంటోనీ.. క్లారిటీ ఇదే..!

తమిళ నటుడు అయిన విజయ్ ఆంటోని తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. బిచ్చగాడు సినిమాతో తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. ఈ సినిమా కంటే ముందు ఎన్నో చిత్రాలు తెలుగులో రీమిక్స్ చేసినప్పటికీ పెద్దగా క్రేజ్ రాలేదు. బిచ్చగాడు సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న విజయ్ ఆంటోని ఆ తర్వాత ఎన్నో చిత్రాలను తమిళంలో నుంచి తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేస్తూ మంచి పాపులారిటీ అందుకున్నారు. ఇటీవల తన పెద్ద కూతురిని కూడా కోల్పోవడం జరిగింది.

తన కూతురు మరణించిన కూడా ఆ బాధను దిగమింగుకొని మరి చిత్ర బృందానికి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ఉద్దేశంతో బిచ్చగాడు -2 సినిమాని పూర్తి చేసి ప్రమోషన్స్ లో పాల్గొనడం జరిగింది భారీ అంచనాల మధ్య విడుదలైన బిచ్చగాడు-2 సినిమా కలెక్షన్స్ పరంగా బాగానే రాబట్టింది ఇదంతా ఇలా ఉండగా గత కొద్దిరోజుల క్రితం విజయ్ ఆంటోని తన భార్య ఫాతిమా కు విడాకులు ఇచ్చి బిగ్బాస్ అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపించాయి

ఈ వార్తలపై విజయ్ ఆంటోనీ కూడా ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ విషయం నిజమేనని కోలీవుడ్ మీడియాలో కూడా వార్తలు వినిపించాయి. అయితే ఈ సమయంలోనే తన కూతురు మరణించడంతో ఈ వార్తలు ఆగిపోవడం జరిగింది. అయితే తాజాగా విజయ్ ఆంటోని రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తల పైన హీరోయిన్ క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. బిగ్ బాస్ -1 లో కంటిస్టెంట్ గా పాల్గొన్న అనూయ.. చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఎన్నో చిత్రాలలో ఈమె స్పెషల్ సాంగులలో నటించిందట.

- Advertisement -

తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటుంది అనూయ. తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో ముచ్చటించిన ఈమె తన గురించి వచ్చిన ఇలాంటి చెత్త రూమర్స్ పై స్పందిస్తూ తనకు నటుడు జీవా, సుందర్ సి, విజయ్ ఆంటోని వంటి వారితో రిలేషన్ ఉందని చాలామంది ఫేక్ వార్తలను సైతం సృష్టిస్తున్నారంటూ ఫైర్ అయ్యింది. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని.. ఇలాంటి అసత్యాలను ఎవరు స్ప్రెడ్ చేయకండి అంటూ తెలియజేస్తోంది. తాను ఇప్పటికీ కూడా సింగిల్ గానే ఉన్నానని తెలియజేసింది.. మరో నెటిజన్ మీరు పెళ్లి చేసుకోరా అని అడగగా తన చుట్టూ ఉన్న మగవాళ్ళంతా మంచివాళ్లు కాదంటూ షాకింగ్ ఆన్సర్ తెలిపింది .దీంతో విజయ్ ఆంటోని రెండో పెళ్లి పై క్లారిటీ వచ్చేసిందని చెప్పవచ్చు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు