Couple Workout : పార్టనర్ తో కలిసి వర్కౌట్స్ చేస్తే బెనిఫిట్స్ ఏంటో తెలుసా?

రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల శరీరం ఫిట్ గా ఉండటమే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటాము. అయితే ఈ రోజుల్లో కపుల్ వర్కౌట్స్ కి ప్రాధాన్యత బాగా పెరిగింది. మరి పార్ట్నర్ తో కలిసి వర్క్ అవుట్ చేయడం ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటి? అంటే…

సాధారణంగా శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి ఏదైనా వ్యాయామం, యోగ వంటి వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో చాలామంది ఫిట్నెస్ కోసం ప్రత్యేకంగా జిమ్ కి వెళ్తూ ఉన్నారు. కొందరు యోగ చేస్తే, మరి కొంతమంది స్విమ్మింగ్, సైక్లింగ్, జాగింగ్, వాకింగ్ వంటి వాటిని ఫాలో అవుతున్నారు. వర్కౌట్స్ చేస్తున్న పద్ధతి ఏదైనా ఈ ఫిట్నెస్ ప్రయాణంలో మీ పార్టనర్ ని కూడా కలుపుకుంటే ఫలితాలు ఇంకా మెరుగ్గా ఉంటాయి. మరి అ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

పార్ట్నర్ తో కలిసి వర్క్ అవుట్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. వర్కౌట్స్ చేస్తున్న సమయంలో ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. కాబట్టి వ్యాయామం చేస్తున్నంతసేపు చాలా విషయాలను ఒకరితో ఒకరు పంచుకోగలుగుతారు. దీనివల్ల మీలో ఉన్న ఒత్తిడి తగ్గిపోతుంది.

- Advertisement -

పార్ట్నర్ తో మీ బంధం మరింత బలపడుతుంది. ఏవైనా వర్కౌట్స్, లేదా యోగా వంటివి చేసేటప్పుడు ఇంకొకటి హెల్ప్ అవసరమవుతుంది. అలా మీ పార్టనర్ కి వర్కౌట్స్ టైం లో మీరు చేసే హెల్ప్ ఇంప్రెస్సివ్ గా ఉంటుంది. అలాగే ఆ స్పర్శ చాలా ప్రత్యేకమైనది. ఫిట్ గా ఉంచుకునే ప్రయత్నాలలో ఇద్దరు ఒకరికి ఒకరు సహాయం చేసుకునే విధానం వల్ల వారి బంధం బలపడుతుంది. దీంతో ఇద్దరు మానసికంగా దగ్గర ఏ అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఒకే ఇంట్లో నివసిస్తున్నప్పటికీ మీ పార్ట్నర్ గురించి మీకు ఎక్కువగా తెలియకపోవచ్చు. అయితే కలిసి వ్యాయామం చేయడం వల్ల, ఆ టైంలో మీరు పంచుకునే విషయాల వల్ల అవతలి వ్యక్తి సమస్యలు, వారికి సంబంధించిన ఇతర విషయాలను బాగా అర్థం చేసుకోగలుగుతారు. దీంతో ఆ తర్వాత కూడా మీ పార్టనర్ను సులభంగా అర్థం చేసుకునే అవకాశం దొరుకుతుంది.

ఈరోజుల్లో బిజీ షెడ్యూల్ అనేది సర్వసాధారణమైన పదం. భార్యాభర్తలిద్దరూ జాబ్స్ చేస్తుండడం వల్ల ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఒకరితో ఒకరు స్పెండ్ చేయడానికి కాస్త టైం దొరికితే బాగుంటుందని చాలామంది కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారికి కపుల్ వర్కౌట్స్ పర్ఫెక్ట్. ఇద్దరి మధ్య ఈ వర్కౌట్స్ దూరాన్ని తగ్గిస్తాయి.

అంతేకాకుండా ఇద్దరూ కలిసి వర్కౌట్స్ చేయడం వల్ల రిలేషన్ షిప్ లో పాజిటివిటీ పెరుగుతుంది . దీంతో ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం కలుగుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పటినుంచి పార్ట్నర్ తో కలిసి వర్కౌట్స్ చేయడానికి ట్రై చేయండి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు