Friendship Tips : మీది వన్ సైడ్ ఫ్రెండ్షిప్పా? ఇలా చెక్ చేసుకోండి

స్నేహం అనేది మనుషులకు దేవుడు ఇచ్చిన అత్యంత అమూల్యమైన బహుమతి. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే అందమైన కనెక్షన్. అయితే మీ ఫ్రెండ్ షిప్ ఎప్పుడైనా తేడా కొట్టిందా? అసలు అవతలి వ్యక్తి మీతో ఫ్రెండ్షిప్ విషయంలో ఎంతవరకు నిజాయితీగా ఉన్నారు? ఫ్రెండ్షిప్ పేరుతో వాళ్లు మిమ్మల్ని వాడుకుంటున్నారా? అసలు మీ ఫ్రెండ్ తో కొనసాగుతున్న ఈ ఫ్రెండ్ షిప్ టూ సైడెడా? లేక వన్ సైడెడా? అనే డౌట్స్ మీకు ఉన్నాయా? అయితే ఈ టిప్స్ మీకోసమే. మీ ఫ్రెండ్ షిప్ ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని ఈ టిప్స్ ద్వారా తెలుసుకోండి.

మీ ఫ్రెండ్ ఎప్పుడు చూసినా కేవలం తన సమస్యల గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటే మీది ఏకపక్ష ఫ్రెండ్షిప్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వారు తమ సమస్యలను, మాటలను వినడానికి మాత్రమే మీకు ఫోన్ చేస్తున్నారు. తమ సమస్యకు పరిష్కారం కోసం మాత్రమే మీతో మాట్లాడుతున్నారు. అంటే అర్థమయ్యేలా చెప్పాలంటే వాళ్ళు మిమ్మల్ని డస్ట్ బిన్ లాగా వాడుకుంటున్నారు.

మీ ఫ్రెండ్ మీతో స్పెండ్ చేయడానికి ఆసక్తి కనబరచకపోతే అది కూడా ఒక సంగీతమే అని అర్థం చేసుకోవాలి. హెల్దీ ఫ్రెండ్షిప్ లో ఒకరినొకరు కలుసుకోవడానికి, కలిసి టైం స్పెండ్ చేసుకోవడానికి ఎప్పుడూ విలువ ఇస్తారు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి.

- Advertisement -

వాళ్ళ అవసరాల కోసం మాత్రమే మీతో మాట్లాడుతుంటే అది ఖచ్చితంగా వన్ సైడ్ ఫ్రెండ్షిప్పే. అంటే వాళ్లు మిమ్మల్ని కేవలం ఉపయోగించుకోవడానికి మాత్రమే చూస్తున్నారని అర్థం.

మిమ్మల్ని తక్కువగా చేసి చూస్తున్నారు అంటే ఆ ఫ్రెండ్ షిప్ కరెక్ట్ గా లేదు అని అర్థం. నిరంతరం మిమ్మల్ని విమర్శిస్తూ, కించపరుస్తూ, మానసికంగా మిమ్మల్ని దెబ్బతీయాలని చూస్తే అది ఫ్రెండ్షిప్ కాదు. నిజమైన ఫ్రెండ్ అంటే కష్టకాలంలో కూడా తోడుగా నిలిచేవారే.

మీరు చెప్పే విషయాలను పట్టించుకోవట్లేదా? నిజమైన ఫ్రెండ్స్ మీరు చెప్పేదాన్ని నిజాయితీగా పూర్తిగా వింటారు. ఒకవేళ నీ మనసులో ఏముందో పంచుకోవడానికి ఆసక్తిని కనబరచకపోతే వాళ్లు నిజమైన ఫ్రెండ్స్ కానేకారు.

మీ జీవితం గురించిన ముఖ్యమైన విషయాలను మరిచిపోయే అబతని వ్యక్తి మీ ఫ్రెండ్ కాదు. నిజానికి ఫ్రెండ్షిప్ అంటే తనకు ప్రత్యేకమైన ఫ్రెండ్ జీవితంలోని స్పెషల్ మూమెంట్స్ ను గుర్తుండిపోయేలా చేస్తారు.

మీ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకోకపోయినా, మీ సంతోషంలో భాగం కాకపోయినా వారు నిజమైన స్నేహితులు కారు. కేవలం ఫ్రెండ్షిప్ ముసుగులో మీ దగ్గర వాళ్ళ అవసరాలను తీర్చుకుంటున్నారు అని అర్థం. నిజమైన స్నేహితులు ఒకరికొకరు తాము సాధించిన సక్సెస్ను కలిసి సెలబ్రేట్ చేసుకుని సంతోషంగా ఉంటారు.

మీ ఎమోషన్స్ ను పట్టించుకోకుండా, మిమ్మల్ని బాధ పెట్టే కామెంట్స్ చేస్తూ, మీ గురించి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్లు కూడా మీ ఫ్రెండ్స్ కారని అర్థం చేసుకోవాలి.

మీతో ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలా, మీ ఇద్దరితో పాటు వేరే ఎవరైనా ఉన్నప్పుడు ఇంకొకలా ప్రవర్తిస్తున్నారు అంటే వాళ్ల వ్యక్తిత్వం కరెక్ట్ గా లేదని అర్థం.

ఇవి మాత్రమే కాకుండా వాళ్ళు చేసిన ప్రామిస్ లను నిలబెట్టుకోకపోవడం, మీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి టైం కేటాయించకపోవడం వంటి విషయాలు కూడా వాళ్ళు మీకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనడానికి సంకేతాలు. ఒకవేళ మీరు గనక ఇలా వన్ సైడ్ ఫ్రెండ్ షిప్ లో ఉంటే, వెంటనే ఆ బంధానికి గుడ్ బై చెప్పేయండి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు