Kantara Movie: పాయల్ రిక్వెస్టింగ్… ఒక్క ఛాన్స్ ప్లీజ్

టాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్… ఎన్ని సినిమాలు వచ్చినా, అవి హిట్ అయినా, ఫ్లాప్ అయినా, RX100 మాత్రం యూత్ మనసుల్లోంచి అంత ఈజీగా వెల్లిపోదు. అలాగే ఇటీవల వచ్చిన మంగళవారం మూవీ కూడా పాయల్ కెరీర్ లో నిలిచిపోయేలా ఉంది. సినిమాకు క్రిటిక్స్ నుంచి ఎలాంటి రివ్యూలు వచ్చినా పాయల్ యాక్టింగ్ కు అయితే మంచి మార్కులే పడ్డాయి.

ప్రస్తుతం ఈమె తమిళంలో గోల్మాల్, ఏంజెల్ సినిమాలు చేస్తుండగా, తెలుగులో కిరాతక అనే సినిమాలో కనిపించబోతుంది. అయితే తాజాగా ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ పాయల్ రిక్వెస్ట్ చేస్తున్న పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కన్నడలో రిషభ్ శెట్టి నుంచి వచ్చిన కాంతార మూవీ ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఈ మూవీకి ప్రీక్వెల్ గా ఓ సినిమా వస్తుంది. దీనికి కాంతార చాప్టర్ 1 అనే టైటిల్ కూడా పెట్టి అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. అయితే ఈ సినిమాలో పాత్రల కోసం మూవీ యూనిట్ ఆడిషన్స్ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన పోస్టర్స్ ను రిలీజ్ చేసింది. 18 – 60 ఆడవాళ్లు.. 30 నుంచి 60 మగవాళ్లు ఆడిషన్స్ లో పాల్గొనవచ్చు అని తెలిపింది.

- Advertisement -

Payal Rajput auditions for Kantara: Chapter 1

దీనికి గ్లామరస్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ రెస్పాండ్ అయింది. ఇలాంటి గొప్ప సినిమాలో భాగం అవ్వడానికి ఇంట్రెస్ట్ తో ఉన్నానని, తనను ఈ సినిమాలో కన్సిడర్ చేయాలి అంటూ ఓపెన్ గా కాంతార మూవీ మేకర్స్ ను రిక్వెస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతే కాదు… మంగళవారం సినిమాలో తన ఫర్మామెన్స్ గురించి కూడా పాయల్ చెప్పుకొచ్చింది.

Payal Rajput auditions for Kantara: Chapter 1

నిజానికి కాంతార మూవీ హర్రర్ టైప్ కాబట్టి… పాయల్ కి మంగళవారం సినిమాలా భయపెట్టడం తెలుసు. దీనికి తోడు RX100 సినిమాలా అందాలను ఆరబోయడం తెలుసు. ఇది తెలుసుకుని పాయల్ రాజ్ పుత్ కి రిషబ్ శెట్టి ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు