Ajay Devgan: బాలీవుడ్ ఖాన్ ల ఆస్తులపై క్లారిటీ ఇచ్చిన అజయ్ దేవగన్.. ఏమన్నారంటే ..?

బాలీవుడ్ లో టాప్ హీరోలు అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే హీరోలలో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్.. అయితే వీరిద్దరూ ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంది. ఇద్దరి నుంచి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు విడుదలై ఇండస్ట్రీ రికార్డులను సైతం తిరగరాశాయి. దీంతో విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు.. అంతేకాకుండా కష్టపడి పైకి వచ్చి కొన్ని కోట్ల రూపాయల ద్వారా ఆస్తులను సంపాదించడం జరిగింది. వీరిద్దరూ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అని కూడా చెప్పవచ్చు.

అయితే ఈ ఇద్దరు హీరోల ఆస్తి కొన్ని వేల కోట్లు ఉన్నాయి.. ఇద్దరి హీరోల విషయంలో ఎవరి ఆస్తి ఎక్కువ అని తెలుసుకోవాలంటే అభిమానులు చాలా ఆత్రుతగా ఉన్నారు. ఈ విషయంలో బాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి అజయ్ దేవగన్ స్పందించారు . వీరిద్దరిలో ఎవరు ధనవంతులో తెలియజేశారు.. ఇప్పటికి ఇద్దరు బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇద్దరిలో ఎవరు ధనవంతుడు అనే విషయంపై అజయ్ దేవగన్ ఏం చెప్పారంటే..

కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ సీజన్-8 షో కి బాలీవుడ్ స్టార్స్ సైతం పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే అజయ్ దేవగన్ తో పాటు ప్రముఖ నిర్మాత, దర్శకుడు రోహిత్ శెట్టి ఈ షోలో పాల్గొనడం జరిగింది.. ఈ క్రమంలోనే కరణ్ అడిగిన ప్రశ్నలకు అజయ్ దేవగన్ సూటిగా సమాధానాన్ని ఇచ్చాడు.షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లలో ఎవరు ఎక్కువ ధనవంతులు అని ప్రశ్నించగా.. ఈ విషయం నుంచి అజయ్ దేవగన్ నోరు విప్పారు.

- Advertisement -

బ్యాంకు బ్యాలెన్స్ లెక్కేస్తే షారుక్ ఖాన్ దగ్గర ఎక్కువగా ఉందని.. అందుకే అతని పైన నాకు నమ్మకం ఎక్కువగా అంటూ ఫన్నీగా తెలియజేశారు. ఎన్నో ఏళ్లుగా కోట్ల రూపాయలను కూడా సంపాదిస్తున్నారని తెలిపారు. ఇదే కాకుండా కొన్ని వందల కోట్ల రూపాయల బిజినెస్ కూడా చేస్తున్నారని షారుక్ ఖాన్ ఆస్తి విలువ రూ.7 వేలకోట్ల వరకు ఉంటుందని ఇదంతా కేవలం అతని సొంత ఆస్తి అని తన కుటుంబ సభ్యులతో కలుపుకుంటే లెక్కలు వేరే లాగా ఉంటాయని తెలియజేశారు.

సల్మాన్ ఖాన్ వెండితెర పైన హీరో గానే కాకుండా వ్యాపారం, టెలివిజన్ పైన కూడా భారీగానే సంపాదిస్తున్నారని.. ఈయన ఆస్తి రూ.3,000 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు అజయ్ దేవగన్. వీటితోపాటు పలు రకాల బిజినెస్ లను కూడా చేస్తున్నారని తెలిపారు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు