Ranbir – Alia: రణబీర్- ఆలియా కూతుర్ని చూసారా.. ఎంత క్యూట్ గా ఉందో..!

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న రణబీర్ కపూర్ – అలియా భట్ 2022 ఏప్రిల్ 14న ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తమ ప్రేమ బంధానికి గుర్తుగా అదే ఏడాది నవంబర్ 6వ తేదీన అలియా భట్ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక తమ కూతురికి రాహా అని నామకరణం చేసినట్లు తెలిపిన ఈ జంట .. అప్పటినుంచి తమ కూతుర్ని చూపించలేదు. అయితే మొదటిసారి క్రిస్మస్ సందర్భంగా తమ కూతురి ముఖాన్ని మీడియాకి చూపించారు ఈ దంపతులు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాహా క్యూట్ ఫేస్ చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా క్రిస్మస్ పండుగను అలియా భట్, రణబీర్ కపూర్ దంపతులు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ముంబైలోని జుహులో కపూర్ ఫ్యామిలీ డిన్నర్ పార్టీని ఏర్పాటు చేయగా.. ఈ పార్టీకి రణబీర్ కపూర్ , అలియా భట్ హాజరయ్యారు. అలాగే తమ కుమార్తె రాహా ని కూడా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఈ జంటను జర్నలిస్టులు పలకరించారు. ఈ క్రమంలోని మీడియాకు తమ కుమార్తెను పరిచయం చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు ఈ జంట. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు రాహాను చూసిన నెటిజన్లు అభిమానులు చాలా క్యూట్ గా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే రణబీర్ కపూర్ ఈ ఏడాది అద్భుతమైన విజయాన్ని అందుకున్నారనే చెప్పాలి. అతను నటించిన యానిమల్ సినిమా డిసెంబరు ఒకటి న విడుదలై ఏకంగా రూ.800 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాపై కొంతమంది విమర్శలు గుప్పించినా బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్లతో దూసుకుపోతోంది. అలియా భట్ సినిమాల విషయానికి వస్తే గంగూభాయ్ కథియావాడి సినిమాతో జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది . ప్రస్తుతం మరికొన్ని సినిమాలలో బిజీగా ఉన్నట్లు సమాచారం. దాదాపు ఏడాదికి పైగా మీడియాకు తమ కూతురిని దూరంగా ఉంచిన ఈ జంట మొదటిసారి రివీల్ చేయడంతో రాహాను చూసి అందరూ చాలా ముద్దుగా ఉంది అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం రాహా రణబీర్, అలియాభట్లకు సంబంధించిన వీడియో చాలా వైరల్ గా మారుతుంది.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు