TheGirlfriend: అతని ప్రేమలో పడిన రష్మిక?

పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన రష్మిక మందన్నా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో ఘాటు బోల్డ్ సీన్లలో నటించి అట్రాక్ట్ చేసింది. అయితే తాజాగా తన బాయ్ ఫ్రెండ్ గురించి ఓపెన్ అయ్యింది రష్మిక. కానీ అది నిజజీవితంలో కాదండి.. రీల్ లైఫ్ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పింది.

టాలీవుడ్ యాక్టర్, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక ఇటీవల “ది గర్ల్ ఫ్రెండ్” అనే సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టారు. ప్రేమ, ఫ్రెండ్షిప్, ఎమోషన్స్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాలో రష్మిక బాయ్ ఫ్రెండ్ ఎవరో ప్రకటించారు. ఈ సినిమాలో రష్మికకు బాయ్ ఫ్రెండ్ గా కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు. ఈయన పలు తెలుగు, కన్నడ సినిమాల్లో కూడా నటించాడు. కన్నడలో దియా సినిమాతో బాగా ఫేమస్ అయ్యాడు దీక్షిత్.

అంతేకాదు దసరా సినిమాతో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి దీక్షిత్ శెట్టిని పరిచయం చేస్తూ రష్మిక వాయిస్ ఓవర్ తో.. ” నా బాయ్ ఫ్రెండ్ పేరు విక్కీ విక్రమ్. ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్. బళ్లారి అబ్బాయి విక్కీనే మా కాలేజ్ టీం విరాట్ కోహ్లీ. స్మైల్ చేస్తే చాలు అమ్మాయిలంతా ఫిదా” అంటూ రష్మిక వాయిస్ బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తుంది. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతుంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు