Sahadev : ట్రైలర్ పైనే నెగిటివ్ టాక్.. ఇక రిలీజ్ చేసి ఏం చేస్తారు?

టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కి రిలీజ్ కాబోతున్న సినిమాల్లో ‘ఈగల్’ కూడా ఒకటి. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా జనవరి 13న రిలీజ్ అవుతుంది. ఇక రవితేజ నుండి వస్తున్న ఒక మాస్ ఆక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతుండగా ఈగల్ నుండి రిలీజ్ అయిన టీజర్, ఇంకా ట్రైలర్ మాత్రం యావరేజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నాయి. ఇక ఈ సినిమా పాటలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే రవితేజ మాస్ లుక్స్ ఇంకా ట్రైలర్ కట్స్ ఆకట్టుకోవడం తో పాటు స్క్రీన్ ప్లే మెప్పిస్తే మూవీ అదరగొట్టే ఛాన్స్ ఉంది.

ఇదిలా ఉండగా ఈగల్ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక హిందీ వెర్షన్ కు ‘సహదేవ్’ అనే టైటిల్ ఫిక్స్ చేయగా, తాజాగా హిందీ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే ట్రైలర్ రిలీజ్ అయ్యాక బాలీవుడ్ ఆడియన్స్ నుండి మాత్రం సహదేవ్ నెగిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. ట్రైలర్ చూసిన ఆడియన్స్ యూట్యూబ్ లో రొట్ట సినిమా అని, ట్రైలర్ చాలా రొటీన్ గా ఉందని, రవితేజ నుండి ఒక కామెడీ ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేశామని, కానీ ఇలాంటి రొటీన్ సినిమా తీస్తాడని అనుకోలేదని జనాలు అంటున్నారు.

అయితే ఇంతకు ముందు కూడా రవితేజ తన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలను హిందీలో రిలీజ్ చేయగా, ఆ సినిమాల రిజల్ట్ ఏమయిందో తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ రిస్క్ అవసరమా.. హిందీలో పోగొట్టుకున్న పరువు చాలదా మళ్ళీ తెలిసి పరువు తీసుకుంటారా అని టాలీవుడ్ ట్రేడ్ పండితులు అంటున్నారు.

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు