Chiranjeevi : ఇంత వరకు టైటానిక్ మూవీ చూడలేదు… రీజన్ ఇదే..!

Chiranjeevi : రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.. ఎందుకంటే విజయ్ , పరుశురాం కాంబినేషన్లో ఇప్పటికే గీత గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్లో ఫ్యామిలీ స్టార్ట్ సినిమా రాబోతుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఏప్రిల్ 5వ తేదీన ఆడియన్స్ ముందుకు రాబోతుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు. ఇక ఈ ఈవెంట్ కి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారని సమాచారం..

చిట్ చాట్ లో చిరు – విజయ్..

ఇదిలా ఉండగా మరొకవైపు తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఈవెంట్ లో చిరంజీవి, విజయ్ దేవరకొండ పాల్గొన్నారు.. గతంలో గీతాగోవిందం సక్సెస్ ఈవెంట్లో కనిపించిన వీరిద్దరూ మళ్లీ ఈవెంట్లో కనిపించడమే కాదు స్పెషల్ చిట్ చాట్ సెషన్ కూడా నిర్వహించారు.. ఇక ఈ చిట్ చాట్ సెషన్ లో భాగంగా విజయ్.. చిరంజీవి ప్రయాణం గురించి.. సక్సెస్ గురించి పలు విషయాలను ప్రశ్నిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే చిరంజీవి చూసే సినిమాల గురించి. అలాగే చూడని సినిమాల గురించి అడిగి అభిమానులను ఆశ్చర్యపరిచారు..

టైటానిక్ అందుకే చూడలేదు..

పలు ప్రశ్నలలో భాగంగా మీరు ఇప్పటి వరకు చూసిన సినిమాల గురించి చెప్పండి అని అడగ్గా.. నేను చూసే సినిమాల గురించి చెబితే మీరు నవ్వుకుంటారు.. నేను చాలా ఇష్టంగా చూసే సినిమాలు ఏవి? అనే విషయానికి వస్తే… నేను చూసే సినిమాలు మిక్కీ మౌస్, లారెల్ అండ్ హార్డీ, కోకోమెలన్ వంటివి చూస్తూ ఉంటాను.. జాకీచాన్, టామ్ క్రూజ్ వంటి లైట్ హార్టెడ్ మూవీస్ చూస్తాను.. అయితే విషాదంతమైన టైటానిక్ ను నేను ఇప్పటివరకు చూడలేకపోయాను అంటూ వెల్లడించారు చిరంజీవి.. ప్రేమ కథకు ప్రతీక అయిన టైటానిక్ సినిమాను చూడని వారు అసలు ఉండరు. అయితే ఇక్కడ ఆయన ప్రేమను చూడకుండా చివరిలో జరిగే విషాదాన్ని తెలుసుకొని ఈ చిత్రాన్ని చూడలేదు అన్నట్టుగా తెలుస్తోంది.. ఈ విషయం తెలిసి మెగా అభిమానులే కాదు సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. మొత్తానికి అయితే సున్నిత మనస్తత్వం కలిగిన చిరంజీవి ఇలాంటి విషాదకరమైన విషయాలకు దూరంగా ఉంటారని మరొకసారి నిరూపితమైంది..

- Advertisement -

పద్మ విభూషణ్ ముందే ఊహించా…

చిట్ చాట్ సెషన్ లో భాగంగా విజయ్.. మీరు మెగాస్టార్ అవుతానని, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అందుకునే స్థాయికి ఎదుగుతానని ఎప్పుడైనా ఊహించారా ? అని ప్రశ్నించగా.. దీనికి చిరంజీవి (Chiranjeevi ) అవును ఊహించాను. ఈ పొజిషన్ కి రావాలని ఊహించాను.. అంటూ చెప్పుకొచ్చారు.. చదువుల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నా రానీ గుర్తింపు నటన వల్ల వస్తుందని.. అందుకే నటన వైపు వచ్చానని.. ఇక ఒక పెద్ద స్టార్ అవ్వాలని.. అందరూ నా గురించి మాట్లాడుకోవాలని కలలు కన్నాను.. ఊహల్లో ఉన్నాను ..ఆ కలలను నిజం చేసుకొని నేడు మెగాస్టార్ చిరంజీవిని అయ్యాను అంటూ చెప్పుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు