SSMB29 : ఆ రచయిత పుస్తకాల ఆధారంగా కథను సిద్ధం చేసారు

SSMB29 : త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మహేష్ బాబు హీరోగా చేసిన సినిమా గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజై స్పందనను అందుకుంది. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. ఈ సినిమా మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతూ వచ్చింది. అయితే మహేష్ బాబుకు ఉన్న ఫ్యామిలీ ఫ్యాన్ ఫాలోయింగ్ వలన ఈ సినిమా కొంతమేరకు సేఫ్ జోన్ లోనే ఉంది అని చెప్పొచ్చు.

ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది ఒక కమర్షియల్ సినిమా అంటూ చిత్ర యూనిట్ మొత్తం ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ వచ్చింది. అదే ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్లిన ఆడియన్స్ అందరికీ ఇది ఒక ప్రాపర్ త్రివిక్రమ్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ సినిమా అని రిలైజేషన్ వచ్చింది. కానీ ఈలోపే ఈ సినిమా నెగిటివ్ టాక్ బయటకు వచ్చేసింది. ఈ సినిమా ఒక మదర్ సెంటిమెంట్ సినిమా అని సినిమా టీం ప్రమోట్ చేయకపోవడం. అలానే ఈ సినిమాలోని మదర్ సాంగ్ కూడా ఉంచకుండా డిలీట్ చేయడం ఇవన్నీ కూడా ఈ సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచి ఈ సినిమాని యావరేజ్ దిశగా తీసుకెళ్లాయి.

వీరి కాంబినేషన్లో ఇదివరకే వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా హిట్ కాకపోయినా టీవీలో వచ్చిన ప్రతిసారి కూడా హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ ను నమోదు చేసుకుంటాయి. ఇంట్లో ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేలా ఉంటాయి ఈ రెండు సినిమాలు. అందుకే ఈ కాంబినేషన్లో 3వ సినిమా వస్తోందంటే అందరికీ అంచనాలు వేరే లెవెల్ లో ఉండేవి. ఎదేమైనా మహేష్ ఇదివరకు ఎప్పుడూ చేయనన్ని డాన్సులు ఈ సినిమాలో చేశాడని చెప్పొచ్చు.

- Advertisement -

ఇకపోతే మహేష్ అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చేస్తున్న సినిమా SSMB29. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై చాలామందికి మంచి అంచనాలు ఉన్నాయి. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి ఈ సినిమాకి దర్శకుడు కావడం. అయితే ఈ సినిమా ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్నట్లు ఇదివరకే చెప్పుకొచ్చారు రైటర్ విజయేంద్రప్రసాద్.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన పూర్తిస్థాయి స్క్రిప్ట్ కంప్లీట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన డైలాగ్స్ ను రాస్తున్నట్లు తెలిపారు విజయేంద్రప్రసాద్. ఈ సినిమాకి సాయి మాధవ్ బుర్ర మాటలు అందిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అతిపెద్ద సంభాషణ రచయితల్లో సాయి మాధవ్ బుర్ర పేరు మాత్రం వినిపిస్తుంది. అయితే ఈ సినిమా కూడా సాయి మాధవ బుర్ర డైలాగ్స్ డైలాగ్స్ స్టార్ట్ చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కు పెద్ద అభిమానులం. అందుకే, ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాయాలనుకుంటున్నాను’ అంటూ చెప్పుకోచ్చారు.

ఇకపోతే ఒక రచయితను చూసి మరో రచయిత ఇన్స్పైర్ అవ్వటం అనేది ఎప్పుడు జరిగేదే. చాలామంది సినిమాలను చూసి కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. ఒక దర్శకుడుని కదిలించిన రచయితలు ఎంతోమంది ఉంటారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చాలా సినిమాలు కూడా పుస్తకాల్లో నుంచి ఇన్స్పైర్ చేసినవే. అలానే ఇంద్రగంటి మోహన్ కృష్ణ కూడా చేసిన చాలా సినిమాలు పుస్తకాలు నుంచి ఇన్స్పైర్ అయినవే. ఇకపోతే ప్రస్తుతం విజయేంద్రప్రసాద్ కూడా ఈ సినిమాను ఒక రచయిత పుస్తకాల నుంచి ఇన్స్పైర్ రాస్తున్నాడు అంటే ఈ సినిమా కూడా ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు. ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి దాదాపు నాలుగేళ్లు పడుతుందని అందరూ ఊహిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు