Naga Chaitanya : చైతూతో పూజ రొమాన్స్.. 10 యేళ్ళ తర్వాత.. ట్విస్ట్ ఇదే..!

Naga Chaitanya : ప్రస్తుతం అక్కినేని వారసుడు నాగ చైతన్య.. కార్తికేయ-2 సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాలో చైతన్య బోటు నడిపే ఒక మత్స్యకారుడిగా కనిపించనున్నారు.. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. ఈ సినిమా కోసం చైతూ తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చేయించుకున్నట్లు సమాచారం.. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రంలో శ్రీకాకుళం యాసలో డైలాగ్స్ ఉండబోతున్నాయని.. ఇప్పటికే వార్తలు వైరలైన విషయం తెలిసిందే.. మొదటి నుంచి ఈ మూవీ పై ప్రేక్షకులలో భారీ హైప్ పెంచుతున్నారు చందు మొండేటి.. ఇప్పటికే రిలీజ్ అయిన పలు పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా లభించింది..

విరూపాక్ష డైరెక్టర్ తో చైతూ..

ఇదిలా ఉండగా తండేల్ చిత్రం సెట్స్ పై ఉండగానే చైతూకి ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయి.. ఈ క్రమంలోనే విరూపాక్ష సినిమాతో సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన కార్తీక్ దండు డైరెక్షన్లో నాగచైతన్య ఒక సినిమా చేయబోతున్నారు.. ఇందుకోసం హీరోని అప్రోచ్ అవ్వగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.. విరూపాక్ష సినిమాను వైవిద్యమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించిన కార్తీక్ దండు.. చైతన్య కోసం మిస్టరీ థ్రిల్లర్ అంశాలతో అదిరిపోయే స్టోరీని సిద్ధం చేశారు..

10 యేళ్ళ తర్వాత చైతూ తో పూజ..

కార్తీక్ దర్శకత్వంలో వచ్చే ఈ సినిమాలో నాగచైతన్య ( Naga Chaitanya ) సరసన దాదాపు పదేళ్ల తర్వాత పూజా హెగ్డే మళ్లీ రొమాన్స్ చేయడానికి సిద్ధమయింది.. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ఒక లైలా కోసం సినిమా వచ్చిన విషయం తెలిసింది ఈ సినిమాతోనే పూజా హెగ్డే ఇండస్ట్రీకి పరిచయం అయింది.. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఈ సినిమా వచ్చినప్పుడు పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ కాదు.. పదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ చైతన్య సరసన నటించబోతున్న ఈమె ఇప్పుడు స్టార్ స్టేటస్ కాస్త పోయింది.. ఇక వరుస ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతోంది.. ప్రస్తుతం పూజా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. మరి దాదాపు 10 ఏళ్ల తర్వాత నాగచైతన్య , పూజా కలిసి రొమాన్స్ చేయబోతున్నారు అనే వార్త తెరపైకి వచ్చింది. కాబట్టి దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రావాల్సి ఉంది.. మరి ఈ జంట ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారో చూడాలి..

- Advertisement -

పూజా హెగ్డే..

పూజా హెగ్డే కెరియర్ విషయానికొస్తే.. ఈ మధ్యకాలంలో ఈమెకు అస్సలు కలిసి రావడం లేదనే చెప్పాలి.. ఒకప్పుడు వరుస సినిమాలతో భారీ క్రేజ్ దక్కించుకున్న ఈమె గత ఏడాది నుంచి ఈమె చేసిన ప్రతి సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలింది. దీంతో ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా వేయించుకుంది ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సోషల్ మీడియాకే పరిమితమైన పూజా హెగ్డే చేతిలో ఒక్క సినిమాలో కూడా నటించకపోవడం ఆశ్చర్యం.. ఇప్పుడు చైతన్య సరసన అవకాశం వచ్చింది కాబట్టి దానిని ఎలా వినియోగించుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు