Pooja Hegde New Movie: పూజకు కొత్త సినిమా ఛాన్స్… చివరికి స్టార్ కిడ్ చేతికి

పూజా హెగ్డే… ఇప్పుడు ఇండస్ట్రీలో మరుగున పడిపోయింది కానీ, కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. రెమ్యునరేషన్ విషయంలో ఆమె డిమాండ్ ఓ రేంజ్‌లో ఉండేది. అంతే కాదు, ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ తో పాటు రోజు వారి ఖర్చు అంటే ఫైట్ టికెట్స్, హొటల్స్ బిల్స్, పర్సనల్ స్టాఫ్, బాడీగార్డ్స్ సాలరీలు అన్నీ ప్రొడ్యూసర్ల నుంచి వసూళ్లు చేసే సంప్రదాయాన్ని స్టార్ట్ చేసింది ఈ బుట్టబొమ్మే. ఈ విషయాన్ని చాటుకు చాలా మంది ప్రొడ్యూసర్లు చెప్పారు. ఓ సందర్భంలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కూడా పూజా హెగ్డే రోజు వారి ఖర్చులు నిర్మాతలే భరిస్తున్నారంటూ తమ గోడును చెప్పుకన్నాడు.

రోజు రోజుకు తగ్గిన క్రేజ్…
కెరీర్ స్టార్టింగ్‌లో పూజా పరిస్థితి ఎలా ఉన్నా.. అలా వైకుంఠపూరములో మూవీ వరకు అయితే పూజా టాప్ హీరోయిన్ అనే చెప్పొచ్చు. అలా వైకుంఠపూరములో సినిమా తర్వాత పూజా క్రేజ్ మరింత పెరిగింది. కానీ, ఆమె డౌన్ ఫాల్ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అలా వైకుంఠపూరములో హిట్ తర్వాత భారీగా ఛాన్స్ లు వచ్చాయి. అలా రాధేశ్యామ్ చేసింది. ఇది దారుణమైన డిజాస్టర్. దీని తర్వాత కోలీవుడ్ లో బీస్ట్ లో నటించింది. అది కూడా చేదు ఫలితాన్ని ఇచ్చింది. తెలుగులో ఆచార్య మూవీలో చేసింది. ఆచార్య గురించి ఆడియన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దీని తర్వాత బాలీవుడ్ లో సర్కస్, కిసికి బాయ్ కిసి కా జాన్ మూవీలో నటించింది. ఈ రెండు సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. దీంతో టాప్ హీరోయిన్ అంటూ చెలామని అయిన పూజా ఒక్క సారిగా ఐరెన్ లెగ్ అనే పేరుతో గట్టిగా ట్రోల్ అయింది.

- Advertisement -

గడ్డు కాలం…
అయినా ఇతర కారణాల వల్ల పూజా హెగ్డేకు తెలుగు ఇండస్ట్రీలో చాలా అవకాశాలు వచ్చాయి. గుంటూరు కారం, ఓ పవన్ కళ్యాణ్ మూవీ, మరొక సాయి ధరమ్ తేజ్ మూవీ అంటూ చాలా సినిమాలకు సైన్ చేసింది. గుంటూరు కారం మూవీకి అయితే ఫస్ట్ షెడ్యూల్ లో షూటింగ్ కు కూడా వెళ్లింది. కానీ, సడన్ గా తప్పుకోవాల్సి వచ్చింది. అచ్చం గుంటూరు కారంలా దాదాపు నాలుగు నుంచి ఐదు సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇది జరిగిన తర్వాత బుట్టబొమ్మకు మళ్లీ ఛాన్స్ లేవీ రాలేదు.

స్టార్ కిడ్‌తో…
ఇప్పటి వరకు సినిమాలేవీ లేకుండా ఉన్న పూజా హెగ్డే కి ఫైనల్ గా ఓ మూవీ వచ్చింది. అయితే ఆ సినిమా ఛాన్స్ వచ్చింది ఓ స్టార్ కిడ్‌తో. స్టార్ కిడ్ తో సినిమా అంటే.. అంతా ఇబ్బంది ఏం లేదు. కానీ, ఈ స్టార్ కిడ్ గతంలో ఓ మూవీ చేశాడు. అది పెద్ద డిజాస్టర్. ఇప్పుడు చేసేది రెండో సినిమా. ఇంతకీ ఆ స్టార్ కిడ్ ఎవరంటే..? సునీల్ శెట్టి వారసుడు అహన్ శెట్టి.

అహన్ శెట్టి.. బాలీవుడ్ కు తడప్ అనే సినిమాతో అడుగు పెట్టాడు. ఇది తెలుగులో సూపర్ హిట్ అయిన ఆర్‌ఎక్స్ 100 మూవీకి రీమేక్. అంత మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ కూడా అహన్ కి హిట్ ఇవ్వలేకపోయింది. ఇప్పుడు ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ తో ఉన్న పూజా హెగ్డేతో అహన్ హిట్ కొట్టగలడా..? చూడాలి మరి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు