Bhimaa : గోపీచంద్ తాను తీసుకున్న గోతిలో తానే పడుతున్నాడా?

టాలీవుడ్ లో కనిపించకుండా పోయిన హీరోల లిస్టులో గోపీచంద్ కూడా చేరిపోతాడు అని అనుకుంటున్న ప్రతిసారి ఏదో ఒక సినిమాతో థియేటర్లోకి వస్తున్నాడు ఈ హీరో. కానీ ఆయన ఎంచుకుంటున్న కథలు మాత్రం రొటీన్ గానే ఉంటున్నాయి. ఫలితంగా వరస డిజాస్టర్ లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు గోపీచంద్. తాజాగా “భీమా” మూవీ విషయంలో కూడా ఇదే జరిగింది. మరి గోపీచంద్ తాను తీసుకున్న గోతిలో తానే పడుతున్నాడా? అని వివరాల్లోకి వెళ్తే…

కాలం చెల్లిపోయిన కథ…
కన్నడ డైరెక్టర్ హర్ష “భీమా” మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. గోపీచంద్ హీరోగా నటించిన ఈ మూవీ ట్రైలర్ తోనే అంచనాలను పెంచేసింది. మహాశివరాత్రి కానుకగా థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ బిలో యావరేజ్ టు యావరేజ్ అనే విధంగా ఉంది. దీనంతటికీ కారణం ఏమిటంటే కాలం చెల్లిన కథ. సినిమా మొదలైన 20 నిమిషాలకే ఇది ఒక రొటీన్ రొట్ట కథ అనే విషయం అందరికీ అర్థమైపోతుంది. హీరో పోలీస్ గెటప్ లో వచ్చి విలన్లను చితక్కొట్టడం, వార్నింగ్ ఇవ్వడం, ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్లి కామెడీ చేయడం లేదంటే మిగిలిన పోలీసులకు క్లాస్ పీకడం వంటి సన్నివేశాలు ఇప్పటికే టాలీవుడ్ లో అవుట్ డేటెడ్ అయిపోయాయి. ఎన్నో సినిమాల్లో దీన్నే రిపీట్ చేయడం, ప్రేక్షకులకు బోర్ కొట్టడం రెండూ జరిగిపోయాయి. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ బాగానే ఉంది. ఇక సెకండ్ హాఫ్ లో సీనియర్ నరేష్ వచ్చి మళ్ళీ కుళ్ళిపోయిన జోకులు వేయడం ఇరిటేషన్ తెప్పిస్తుంది. ఇక గోపీచంద్ మరో గెటప్ లో కనిపించడం కన్ఫ్యూజన్ కు గురి చేస్తుంది. అది క్లైమాక్స్ వరకు అలాగే కంటిన్యూ అవుతుంది. ఈ సినిమాకు రవి బస్రూర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, రెండు పాటలు, సినిమాటోగ్రఫీ, ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్, గోపీచంద్ ప్లస్ పాయింట్స్.

గోపీచంద్ ఇక మారడా?
“భీమా”లో గోపీచంద్ తన పరిధి మేరకు అద్భుతంగా నటించి మెప్పించాడు. ముఖ్యంగా స్క్రీన్ ప్రజెన్స్ తో ఒక పెద్ద సినిమా చూస్తున్న ఫీలింగ్ ను తెప్పించాడు. కానీ ఇలాంటి రొటీన్ అవుట్ డేటెడ్ సినిమాలు ఇంకా గోపీచంద్ ఎందుకు చేస్తున్నాడు? అనేదే ఇక్కడ ప్రశ్న. ఇలాగే కంటిన్యూ అయితే త్వరలోనే గోపీచంద్ కనుమరుగు కావడం ఖాయం. గతంలో ఈ హీరో చేసిన ప్రయోగాత్మక సినిమాలను ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా గోపీచంద్ హీరోగా నటించిన ఒక్కడున్నాడు, సాహసం వంటి సినిమాలకి కల్ట్ ఫాన్స్ ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు అలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేస్తే వర్క్ అవుట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. కమర్షియల్, రొటీన్ కథలను కాకుండా కొత్తదనాన్ని కోరుకుంటూ కంటెంట్ బేస్డ్ సినిమాలకు ప్రాధాన్యతనిస్తున్నారు.

- Advertisement -

ఒకవేళ కమర్షియల్ సినిమాలే చెయ్యాలి అని అనుకుంటే గోలీమార్ సినిమాలో చేసిన రోల్స్ అయినా ట్రై చెయ్యొచ్చు. “భీమా” ప్రమోషన్స్ లో కూడా ఎందుకు మీరు ఇలాంటి సినిమాలు చేస్తున్నారు? ఒక్కడున్నాడు వంటి ప్రయోగాత్మకత సినిమాలు ఇప్పుడు చేస్తే ఆ కిక్కే వేరు కదా? అనే ప్రశ్న ఎదురైంది గోపీచంద్ కి. సరైన కథ, డైరెక్టర్ దొరికితే చేయడానికి రెడీ అని, అదే ప్రయత్నంలో ఉన్నానని గోపీచంద్ సమాధానం ఇచ్చాడు. కానీ ఇప్పటికైనా గోపీచంద్ కథల విషయంలో కళ్ళు తెరిచి, ట్రాక్ మారిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు ఆయన అభిమానులు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు