HBD Zakir Hussain : జాకీర్ హుస్సేన్ .. ది వరల్డ్స్ గ్రేటెస్ట్ తబలా ప్లేయర్..

మన దేశంలో సినిమాలకి, పాటలకి, ఇతర సంగీత కళలకి ఉన్నంత అభిమానం ఏ దేశంలోనూ ఉండదు అన్న విషయం తెలిసిందే. ఇక సంగీతంలో ప్రావీణ్యులైన వాళ్ళ పేర్లు చెప్పారంటే మ్యూజిక్ డైరెక్టర్ అయితే దేవిశ్రీ, థమన్ లేదా, గాయకులూ అంటే ఎస్పీ బాలు వంటి వారి పేర్లు చెప్తాం. అలాంటిది ఆ సంగీతానికి బీజం వేసిన తబలా, మృదంగం వంటి వాటిలో ప్రావీణ్యులైన వారి పేర్లు చెప్పమంటే ఈ జెనరేషన్ లో ఒక్కరి పేర్లు చెప్పలేం. ఒకవేళ ఎవరైనా తెలిసినా వెంటనే గుర్తుకు రావడం కష్టం. కానీ సంగీత జ్ఞానం ఉన్న వాళ్ళెవరైనా ఫేమస్ తబలా ప్లేయర్ ఎవరూ అంటే ఆయన్ని యిట్టె గుర్తుపడతారు. బహుశా తొందరగా పేరు చెప్పలేరేమో.. ఇంకా ఈజీ గా గుర్తుపట్టాలంటే ఒకప్పుడు టీవీల్లో వాహ్ తాజ్ అంటూ తబలా వాయించి యాడ్ చేసిన ఫేమస్ తబలా ప్లేయర్. వారే “జాకీర్ హుస్సేన్”. ఈ రోజు తబలా విధ్వంసులు పద్మవిభూషణ్ జాకీర్ హుస్సేన్ పుట్టినరోజు. ఈ సందర్బంగా ఆయనకి ఫిల్మీ ఫ్య తరపున బర్త్ డే విషెస్ తెలియచేస్తూ ఆయన ఎదిగిన రోజుల్ని ఒక్కసారి చర్చించుకుందాం.

వరల్డ్ గ్రేటెస్ట్ తబలా ప్లేయర్ ..

భారత దేశంలో ఉన్న ఎందరో ప్రఖ్యాత సంగీత విధ్వంసుల్లో జాకీర్ హుస్సేన్ భారతీయ తబలా విధ్వంసులు. అలాగే సంగీత దర్శకుడు, కూడా. తన సంగీతంతో దేశ విదేశాల్లో ఖ్యాతి గాంచిన జాకిర్ హుస్సేన్ మార్చి 9, 1951 న ముంబై లోనే జన్మించారు. ఆయన తండ్రి అల్లా రఖా కూడా సంగీత తబలా విధ్వంసుడే కావడం వల్ల మూడేళ్ళ ప్రాయంలోనే సంగీతం పై దృష్టి పెట్టాడు హుస్సేన్. అలా తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న జాకీర్ హుస్సేన్ చిన్నతనంలోనే పక్వాజ్ అనే సంగీత వాయిద్యాన్ని నేర్చుకున్నారు. అప్పటినుండి ఎన్నో రకాల వాయిద్యాలపై ఆయన దృష్టి పెట్టేవారు. ముంబై లోని సెయింట్ మైకేల్ హైస్కూల్లో పదవ తరగతి.. తరువాత సెయింట్ జేవియర్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్న జాకిర్, తన 11 వ ఏట నుంచే దేశ విదేశాలను పర్యటిస్తూ.. అనేక ప్రదర్శనలు ఇచ్చారు.

- Advertisement -

విదేశాలకు వెళ్లి అక్కడి నుండే ప్రదర్శనలు..

డిగ్రీ తర్వాత జాకీర్ ఉన్నత చదువు కోసం 1969 లో అమెరికా కు వెళ్లి, అక్కడ వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో సంగీతంలో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. ఇక అప్పటి నుంచి ఆయన దాదాపు విదేశాల్లో ఏడాదికి 150 కి పైగా ప్రదర్శనలు ఇచ్చారు. జాకిర్ హుస్సేన్ మొదటి ఆల్బం 1991 లో విడుదల కాగా, 1992 లో బెస్ట్ వరల్డ్ మ్యూజిక్ ఆల్బం గా గ్రామీ అవార్డు అందుకుంది. వరల్డ్ మ్యూజిక్ విభాగంలో ఈ అవార్డును ఆ ఏడాదే మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేశారు. ఇక జాకిర్ హుస్సేన్ సంగీతానికి చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలతో సకరించింది.ఇక జాకిర్ హుస్సేన్ కథక్ నృత్యకారుణి మిన్నేకోలాను వివాహం చేసుకోగా, ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. ఇక జాకిర్ హుస్సేన్ ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కో లో నివాసం ఉంటున్నారు.

ఇక జాకీర్ హుస్సేన్ సినిమాలకి పని చేయడం చాలా అరుదు. హిందీలో సంజయ్ లీల భన్సాలీ వంటి దర్శకులకు సంగీత ప్రాధాన్యం ఉన్న కొన్ని సినిమాలకి తబలా వాయించగా, సౌత్ లో శంకర్ రెండు మూడు సినిమాలకు తబలా వాయించారని అంటారు. అయితే చాలా మంది తెలుగువారికి మాత్రం ‘వాహ్ తాజ్ అనండి’ అంటూ ‘తాజ్ మహల్ టి’ యాడ్ తో జాకిర్ హుస్సేన్ పరిచయం.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు