Heroines: ఆ విషయంలో దిగొచ్చిన సినీ తారలు.. కారణం..?

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతున్న నేపథ్యంలో హీరోలతో పాటు హీరోయిన్లు కూడా పారిపోషకం పెంచేసి నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు.. మరోవైపు సినీ ఇండస్ట్రీలో హీరోల కొరత ఉన్నప్పటికీ హీరోయిన్ల కొరత ఎప్పటికీ ఉండదని చెప్పవచ్చు.. ఎందుకంటే ప్రతి ఏడాది కూడా కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు.. దీంతో పాత హీరోయిన్ లకి అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి.. ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు కోట్లల్లో పారితోషకం తీసుకుంటున్న ఈ హీరోయిన్ల పరిస్థితి ఇప్పుడు కోట్ల నుంచి లక్షలకు దిగి వచ్చింది. ఇకపోతే ఇప్పటికిప్పుడు ఇంత మార్పు రావడానికి కారణం కూడా లేకపోలేదు.

పైగా హీరోయిన్స్ అంతా ఎందుకు ఇంత సడన్ గా కట్టకట్టుకొని మరీ రెమ్యునరేషన్ ని తగ్గిస్తూ ఉండడంతో అభిమానులను సరికొత్త అనుమానాలు నెలకొన్నాయి.. పైగా ఒక సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నామంటే ఆ హీరోయిన్ కోరికలు మామూలుగా ఉండవు ఎక్కడలేని గొంతెమ్మ కోరికలు కోరి నిర్మాతలను ముప్పతిప్పలు పెడుతూ ఉంటారు.. అలాంటి పరిస్థితుల నుంచి సడన్గా ఇంత మార్పు ఎలా సాధ్యమైంది అనేది ఇప్పుడు అభిమానులలో కూడా అర్థం కాని పరిస్థితి.. మరి ఇలాంటి పరిస్థితుల్లో హీరోయిన్లు ఎందుకు పారితోషికం తగ్గించారు..అనేది ఇప్పుడు చూద్దాం..

ఓటీటీ హవా తగ్గడమే..
ముఖ్యంగా హీరోయిన్ల పారితోషకం విషయంలో నిలకడగా ఉన్నది సాయి పల్లవి, నయనతార లాంటి హీరోయిన్లు మాత్రమే అని చెప్పాలి. ఇక మిగతా వారి పరిస్థితి విషయానికి వస్తే.. ఓటీటీ రైట్స్ సడన్గా పడిపోవడమే.. హీరోయిన్ తమ పారితోషకాలు తగ్గించుకోవడానికి ప్రధాన కారణం అయ్యింది..ఒకప్పుడు సినిమాలకు ఎంత అడిగితే అంత రెమ్యూనరేషన్ ఇస్తూ వచ్చారు నిర్మాతలు కానీ ఎప్పుడైతే ఓటీటీ హవా డౌన్ అవుతూ వచ్చిందో అప్పుడు హీరోయిన్స్ కూడా తమ రెమ్యునరేషన్ ను తగ్గించుకుంటూ వస్తున్నారు.. అలాగే ఫ్రీ గా కంటెంట్ చూడడానికి జనాలు కూడా ఇష్టపడుతున్నారు.. అందుకే కోట్లు పెట్టే సినిమాలు తీస్తే థియేటర్లకి జనాలు రావట్లేదు.. పైగా జనాలు రాకుండా నిర్మాతలకు డబ్బులు రావు.. అలాంటప్పుడు వీళ్ళకి కోట్లల్లో పారితోషకాలు ఇవ్వాలంటే సాధ్యమయ్యే పని కాదు. అందుకే అందుకే ఈ హీరోయిన్లకు పారితోషకాలు తగ్గించి ఇస్తున్నారు..

- Advertisement -

దారుణంగా మారిన హీరోయిన్స్ పరిస్థితి..
మరోవైపు తమన్నా, కీర్తి సురేష్ , కాజల్, రాశి కన్నా లాంటి హీరోయిన్లు ఓటీటీలో కనిపించడం లేదు.. కరోనా సమయంలో ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే ఓటీటీ లో సినిమా తీయడానికి ఆసక్తి చూపించారు.. ఇప్పుడు డిజిటల్ మార్కెట్ దారుణంగా పడిపోయింది దాంతో తమ పారితోషకాన్ని తగ్గించుకుంటున్నారు హీరోయిన్లు.. ఇదిలా ఉండగా ఒకానొక సమయంలో శ్రీ లీల, కృత్తి శెట్టి లాంటివాళ్ళు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించారు.. ఇప్పుడు వీరు కూడా మాయమయ్యారు. ఇక ఇప్పుడు సమంత , తమన్నా లాంటి వారి మార్కెట్ కూడా డౌన్ అయిన నేపథ్యంలో వారి పారితోషకాలు కూడా పడిపోయాయి. అందుకే యంగ్ హీరోయిన్లు కూడా తమ పారితోషకాలు తగ్గించుకొని మరి సినిమాలలో అవకాశం వస్తే చాలు నటిస్తాము అన్నట్లుగా మారిపోయారు.. ఏది ఏమైనా హీరోయిన్లు పారితోషకాలు తగ్గించుకొని నిర్మాతలకు కాస్త ఊరట కలిగించారని చెప్పవచ్చు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు