Premalu : అంతగా లేపడానికి “ప్రేమలు”లో ఏం ఉందంటే?

పొరుగింటి పుల్లకూర రుచి అనే సామెతను మనం వింటూనే ఉంటాం. అలాగే ఇది తెలుగు మూవీ లవర్స్ కి కూడా బాగా వర్తిస్తుంది. డబ్బింగ్ సినిమాలకు టాలీవుడ్ లో దక్కుతున్న ఆదరణ అందుకు నిదర్శనం. ఇప్పుడు ఇదంతా ఎందుకు? అంటే తాజాగా రిలీజ్ అయిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ “ప్రేమలు” గురించి. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీకి వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. దీంతో అసలు ఆ మూవీలో అంతగా ఏముంది అనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే మలయాళంలో సంచలనం సృష్టించిన ఈ మూవీని రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులోకి డబ్ చేసి, మార్చి 8న రిలీజ్ చేశారు. మరి ఇంతకూ “ప్రేమలు” మూవీని అంతగా ఎందుకు లేపారు? అనే వివరాల్లోకి వెళితే…

ఆ మ్యాజిక్ వర్క్ అవుట్ అయింది…
రీనూ అనే సాఫ్ట్వేర్ అమ్మాయి, సచిన్ సంతోష్ అనే అబ్బాయి మధ్య జరిగే ప్రేమ కథ “ప్రేమలు”. రెస్పాన్సిబిలిటీ లేని అబ్బాయిలంటే నచ్చని రీనూను సచిన్ ఎలా మెప్పించాడు అన్నదే కథ. స్టోరీలో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాకపోతే స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు డైరెక్టర్ గిరీష్. ముఖ్యంగా సినిమాలో సోషల్ మీడియాలో ఉండే నిబ్బా నిబ్బి బ్యాచ్ కి కనెక్ట్ అయ్యే విధంగా డైలాగులు ఉంటాయి. అంతేకాకుండా వన్ లైనర్స్ బాగా పేలాయి. ఆ క్రెడిట్ అంతా 90s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ దే. “ప్రేమలు” తెలుగు వర్షన్ కు డైలాగులు అందించింది అతనే. ముఖ్యంగా కుమారి ఆంటీ అంటూ ట్రెండింగ్ టాపిక్స్ అన్నిటిని టచ్ చేశారు. దీంతో కొన్ని సన్నివేశాలు హిలేరియస్ గా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ వరకు మూవీ బాగానే ఉంటుంది. కానీ క్లైమాక్స్ మాత్రం సిల్లీగా అనిపిస్తుంది. ఇక సినిమా ప్లస్ పాయింట్స్ లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది హైదరాబాద్ లొకేషన్స్. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ ఎక్కువగా హైదరాబాద్ లోనే చిత్రీకరించారు. పైగా తక్కువ బడ్జెట్లో హై క్వాలిటీతో ఈ మూవీని తీశారు. అలాగే సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్ అన్నీ బాగున్నాయి.

ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు చాలామందికి ఎందుకు “ప్రేమలు”ను అంతగా లేపారు? అనే డౌట్ వచ్చింది. తెలుగులో డబ్బింగ్ అయ్యాక ఆ విషయం అర్థమైంది. సినిమా కథ రొటీనే… అయినప్పటికీ కామెడీ, ఫస్టాఫ్, మ్యూజిక్, పర్ఫామెన్స్ బాగుండడం వల్ల యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. అందుకే మలయాళంలో కూడా ఈ మూవీకి ఇంత హైప్ వచ్చింది.

- Advertisement -

మరో ప్లస్ పాయింట్ ఇదే…
ఇక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అనగానే ఏదో బూతు సీన్లు పెట్టేసి, డబుల్ మీనింగ్ డైలాగులతో నెట్టుకు రావడం కాకుండా “ప్రేమలు” మూవీని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసే విధంగా రూపొందించారు. ఒక్క మాటలో చెప్పాలంటే మరో “మ్యాడ్” లాంటి మూవీ. మొత్తానికి ఫ్యామిలీతో కలిసి థియేటర్లలో కడుపుబ్బా నవ్వుకునే మంచి ఆప్షన్ కావడంతో తెలుగులో కూడా “ప్రేమలు” మూవీకి మంచి రెస్పాన్సే వస్తుంది. మరి కలెక్షన్స్ పరంగా ఎన్ని కోట్లు కొల్లగొడుతుందో చూడాలి.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు