Love Guru : విజయ్ ఆంటోనీ ‘లవ్ గురు’ ఓటిటి రిలీజ్ ఆరోజే?

Love Guru : కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోనీ హీరోగా మారిన తర్వాత చాలా బిజీ అయిపోయాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా పాపులర్ అయిన ఇతను తమిళ్ లో హీరోగా మారి చాలా ఏళ్ళే అయినా, బిచ్చ‌గాడు బ్లాక్‌బ‌స్ట‌ర్ తో సౌత్ మొత్తం స్టార్ డమ్ సంపాదించాడు. ఇక లాస్ట్ ఇయర్ బిచ్చగాడు 2 తో మరో హిట్ కొట్టిన విజయ్ ఈ ఇయర్ రెండు వారాల కింద ‘ల‌వ్‌గురు’ అనే ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాని స్వ‌యంగా విజ‌య్ ఆంటోనీ ప్రొడ్యూస్ చేయగా ఏప్రిల్ 11న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా యావరేజ్ మూవీ గా నిలుస్తుంది.

మొదటి సారి కెరీర్ లో భిన్నంగా..

ఇక ల‌వ్‌గురు సినిమాలో మృణాళిని ర‌వి హీరోయిన్‌గా న‌టించగా హీరోగా విజ‌య్ ఆంటోనీ ఎక్కువ‌గా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థ‌ల‌తోనే సినిమాలు చేశాడు. వాటికి భిన్నంగా పూర్తిగా రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా ల‌వ్‌గురు రూపొందింది. అయితే న‌టుడిగా మాత్రం విజ‌య్ ఆంటోనీ ఈ మూవీలో కొత్త‌గా క‌నిపించినా, కానీ స్టోరీ రొటీన్ కావ‌డంతో ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని అందుకోలేదు. అయితే సినిమా కథ విషయానికొస్తే.. బిజినెస్ మెన్ అయిన అర‌వింద్ కుటుంబ బాధ్య‌త‌ల కార‌ణంగా ప్రేమ‌, పెళ్లి లాంటి బంధాల‌కు దూరంగా ఉంటాడు. అయితే 35 వ‌య‌సు దాటిన త‌ర్వాత లీలా అనే అమ్మాయితో అర‌వింద్ పెళ్లి జ‌రుగుతుంది. అయితే త‌ల్లిదండ్రుల బ‌ల‌వంతంతోనే అర‌వింద్‌ను పెళ్లిచేసుకుంటుంది లీలా.
హీరోయిన్ కావాల‌న్న‌ది లీలా కోరిక, అది తెలుసుకున్న అరవింద్ లీలా కోసం ఏం చేసాడు ఆమె కోరిక తీరిందా? అరవింద్ ఆమె మనసు గెలుచుకున్నాడా? అనేది కథ . ఇక ల‌వ్‌గురు మూవీలో యోగిబాబు, వీటీవీ గ‌ణేష్ కీల‌క పాత్ర‌లు పోషించగా, భ‌ర‌త్ ధ‌న్ శేఖ‌ర్ మ్యూజిక్ అందించాడు.

ఇక లవ్ గురు ఓటిటిలో..

అయితే తాజాగా ల‌వ్ గురు (Love Guru) సినిమా అప్డేట్ వచ్చేసింది. రెండు వారాల కింద రిలీజ్ అయిన ఈ సినిమా త్వ‌ర‌లోనే ఓటీటీలో రిలీజ్ కాబోతున్న‌ట్లు వార్తలు వస్తున్నాయి. త‌మిళంలో ఈ మూవీ రోమియో పేరుతో రిలీజైంది. త‌మిళ వెర్ష‌న్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ద‌క్కించుకున్న‌ది. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ లో లవ్ గురు (రోమియో) సినిమా మే 3 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్టు సమాచారం. అయితే అందులో తమిళ్ వెర్షన్ మాత్రమే వస్తుందట. ఇక అదే రోజు ఆహా ఓటీటీలో తెలుగులో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. ఏప్రిల్ లాస్ట్‌వీక్‌లో ల‌వ్ గురు ఓటీటీ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఇక విజయ్ ఆంటోనీ ప్ర‌స్తుతం నాలుగు సినిమాల్లో హీరోగా న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. అగ్ని సిరాగుల్‌, హిట్ల‌ర్‌, ఖాకీ, వాలిమెయిల్ సినిమాలు చేస్తున్నాడు. 2024లోనే ఈ నాలుగు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు