Love Guru : విజయ్ సినిమా ఆ బాలీవుడ్ మూవీ కి కాపీయా?

Love Guru : ప్రముఖ కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన బిచ్చగాడు సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ కావడం కొట్టడమే కాకుండా, తెలుగులో కూడా మంచి మార్కెట్ ని క్రేజ్ ని తెచ్చుకున్నాడు. అయితే ఆ స్థాయి హిట్ మాత్రం తెలుగులో మళ్ళీ పడలేదు విజయ్ కి. అయినా ఒక్క హిట్టు లేకపోయినా విజయ్ ఆంటోనీకి తెలుగులో మార్కెట్ ఇంకా స్థిరంగా ఉండడం విశేషం. ఆయన సినిమాలకు డిమాండ్ ఇప్పటికీ వస్తుంది. అయితే హిట్లు ప్లాప్ ల సంగతి పక్కన పెడితే విజయ్ ఆంటోనీ రెగ్యులర్ కథల జోలికి వెళ్లకుండా, ఎప్పుడూ సినిమాల్లో ఏదో విభిన్నంగా ప్రయత్నిస్తూనే ఉంటాడు. అందుకే తెలుగులో విజయ్ ఆంటోనీ సినిమాలకు డిమాండ్ ఉంటుంది. ఇక తాజాగా ఈ కోలీవుడ్ హీరో ‘లవ్ గురు’ అనే కామెడీ లవ్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తమిళంలో రోమియో టైటిల్ తో వచ్చిన ఈ ఎంటర్టైనర్ తెలుగు, తమిళ భాషల్లో భాషల్లో ఒకేసారి రిలీజయ్యింది. ఇక ఈ సినిమాలో మిర్నళిని రవి హీరోయిన్ గా నటించగా వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించాడు. తెలుగులో ఈ సినిమాను మైత్రి సంస్థ పంపిణి చేసింది. అయితే గురువారం రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి యావరేజ్ రెస్పాన్స్ ని అందుకుంది.

కథ నేపథ్యం ఇదే..

ఇక లవ్ గురు (Love Guru) సినిమా కథ విషయానికి వస్తే.. ముప్పై ఐదేళ్ల వయసు దాటిన అరవింద్ (విజయ్ ఆంటోనీ) మలేషియాలో లైఫ్ సెటిల్ చేసుకుని పెళ్లి గురించి ధ్యాసే మర్చిపోతాడు. అయితే తల్లి తండ్రులు బలవంతం చేయడంతో ఇండియాకు వచ్చి లీల (మృణాళిని రవి) ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. అయితే లీల జీవిత లక్ష్యం హీరోయిన్ కావడం. కేవలం కుటుంబం ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికే తనను చేసుకుందని అర్థం చేసుకున్న అరవింద్ ఆమెకు ప్రేమతో దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో దీనికి చెల్లికి సంబంధించిన ఒక గతం కూడా ఉంటుంది. చివరికి అరవింద్ భార్య మనసును గెలుచుకునేందుకు ఏం చేశాడనేదే లవ్ గురు కథ. ఈ కథని మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. ముఖ్యంగా పాత సినిమాలు ఈ నేపథ్యంలో చాలానే వచ్చాయి. అయితే లవ్ గురు మాత్రం ఓ హిందీ సినిమాకు కాపీ లా ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

లవ్ గురు స్టోరీ ఈ హిందీ సినిమాకి కాపీలా?

అయితే విజయ్ ఆంటోనీ నటించిన లవ్ గురు సినిమా ఒక హిందీ సూపర్ హిట్ సినిమాను పోలి ఉందని నెట్టింట వార్తలు వస్తున్నాయి. షారుఖ్ ఖాన్ అనుష్క శర్మ జంటగా నటించిన ‘రబ్ నే బనాది జోడి’ కథని పోలి ఈ సినిమా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. ఆ సినిమాలో షారుఖ్ ఓ పెళ్ళికి వచ్చి, తన గురువు కోరిక మేరకు ఆయన కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. ఇక హీరోయిన్ తండ్రి చివరి కోరికమేరకు అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అది అర్ధం చేసుకున్న హీరో ఆమె రూట్లోనే వెళ్లి, ఆమె కోరుకున్నట్టుగా మారి ఎలా ఆమె ప్రేమను గెలుచుకున్నాడనేదే స్టోరీ. లవ్ గురు కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. ఇక హీరోయిన్ డ్రీం ని చూస్తే తెలుగులో పాతికేళ్ల కింద వచ్చిన ‘ఆయనకు ఇద్దరు’ లో రమ్యకృష్ణ పాత్రని పోలి ఉంటుంది. అయితే దర్శకుడు వినాయక్ ఈ లవ్ గురు కథని ప్రేక్షకులని పూర్తి స్థాయిలో అందించడం లో విఫలమయ్యాడని వార్తలు వస్తున్నాయి. వినోద కోణంలో ట్రీట్ మెంట్ కొంత ఫ్రెష్ గా అనిపించినా సెకండ్ హాఫ్ లో ఎంటర్టైన్ చేయడంలో జరిగిన తడబాటు వల్ల లవ్ గురు ఒక మాములు సినిమాగా మిగిలిపోయింది. అయితే పెర్ఫార్మన్స్ పరంగా హీరోహీరోయిన్లు మంచి మార్కులే కొట్టేసారు. కానీ ఈ సినిమాలో సీన్లన్నీ ఊహించినట్టే జరుగుతాయి కాబట్టి థియేటర్లలో ఎంత వరకు నెట్టుకొస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు