War 2 Shooting update : ఫస్ట్ షెడ్యూల్ పూర్తి హైదరాబాద్ కి తిరిగి వచ్చెసిన తారక్…రెండో షెడ్యూల్ ఎప్పుడు అంటే..?

War 2 Shooting update : టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ సినిమా షూట్ చేస్తూనే సెట్స్ పైకి మరో సినిమా War2 ని తీసుకువచ్చాడు. తారక్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్టుల్లో వార్2 ఒకటి అని తెలిసిందే. బాలీవుడ్ లో ఐదేళ్ల కింద వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ వార్ కి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. అప్పుడు వార్ లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం నమోదు చేసింది. ఇక ఈ సీక్వెల్ మూవీ లో హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్ కి ఇది తొలి బాలీవుడ్ మూవీ అవడంతో పాటు, హృతిక్, తారక్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుండంతో ఈ సినిమాపై ఇటు సౌత్ లోనూ నార్త్ మూవీ లవర్స్ లోనూ ఓ రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి. ఇక రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కావడం జరిగింది. షూటింగ్ మొదటి షెడ్యూల్ లోనే తారక్, హృతిక్ పై పలు కీలక సన్నివేశాలని చిత్రీకరించారు.

అప్పుడే షెడ్యూల్ పూర్తి..

అయితే వార్ 2 ఫస్ట్ షెడ్యూల్ కి సంబంధించి రీసెంట్ గా హీరోల కి సంబంధించి కొన్ని స్టిల్స్ కూడా లీక్ కావడం జరిగింది. అయితే ఫస్ట్ షెడ్యూల్ కే ఇలా స్టిల్స్ లీక్ కావడంతో ఫ్యాన్స్ మేకర్స్ పై గుర్రు మీదున్నారు. ఇక చిత్ర యూనిట్ కూడా అప్రమత్తమై ఇక ముందు నుండి షూటింగ్ మరింత పగడ్బందీగా ప్లాన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా లీక్ అయిన స్టిల్స్ ని బట్టి హీరోలిద్ధరి మేకప్ అవతారం చూస్తుంటే యాక్షన్ సన్నివేశాలు, లేదా స్పై సీన్స్ ను మేకర్స్ తెరకెక్కించారని తెలుస్తుంది. అయితే పది రోజుల షూట్ అని మేకర్స్ అనుకున్నప్పటికీ తాజాగా ఎన్టీఆర్ ముంబై నుండి హైదరాబాద్ కి వస్తున్న స్టిల్స్ వైరల్ అయ్యాయి. అంటే ఫస్ట్ షెడ్యూల్ కేవలం వారం రోజుల్లోనే పూర్తి చేసారని తెలుస్తుంది. ఇక ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పై ఒక భారీ సాంగ్ తో పాటు యాక్షన్ సన్నివేశాన్ని కూడా తీసారని వార్తలు సమాచారం. ఇక డైరెక్టర్ అయాన్ ముఖర్జీ కెరీర్ లోనే ఇదొక బిగ్గెస్ట్ మూవీగా రూపొందుతుంది.

రెండో షెడ్యూల్ అప్డేట్..

ఇక తాజాగా ఎన్టీఆర్ వార్ 2 (War 2 Shooting update) సెట్స్ లో పాల్గొని తాజాగా హైదరాబాద్ కి పయనమయ్యారు. ముంబై ఎయిర్పోర్ట్ లో తారక్ కి సంబంధించిన వీడియోస్ లీక్ కాగా, ఆ వీడియోస్ ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. ఇక వార్ 2 తర్వాతి షెడ్యూల్ గురించి కూడా అప్డేట్ వచ్చింది. హైదరాబాద్ కి వచ్చాక ఎన్టీఆర్ రెండు మూడు రోజులు బ్రేక్ తీసుకుని దేవర షూటింగ్ లో పాల్గొంటాడు. దేవర షెడ్యూల్ కూడా మరో వారం నుండి పది రోజులు ఉంటుందట. ఇక దేవర షూట్ పూర్తి కాగానే మళ్ళీ వార్ 2 సెట్స్ లోకి అడుగుపెడతాడట తారక్. ఇక డైరెక్టర్ అయాన్ ముఖర్జీ వంద రోజుల వర్కింగ్ డేస్ లోనే వార్2 షూట్ కంప్లీట్ చేయాలనీ భావిస్తున్నాడట. అందుకు తగ్గట్టే హృతిక్ తారక్ డేట్లు తీసుకున్నాడని తెలుస్తుంది. ఇక దేవర షూటింగ్ కూడా 85 శాతం పూర్తయిపోవచ్చిందని సమాచారం. దేవర దసరా కానుకగా ఈ ఇయర్ వస్తే, వార్2 సమ్మర్ కానుకగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు