Star Hero: ఒకప్పుడు ఐశ్వర్యతో రొమాన్స్.. కట్ చేస్తే బాత్రూమ్ కడిగేంత దీనస్థితి..!

Star Hero.. సినిమా ఇండస్ట్రీలో ఎవరి పరిస్థితి ఎప్పుడు.. ఎలా మారుతుందో చెప్పడం కష్టం.. ఒకప్పుడు స్టార్ పొజిషన్ అనుభవించిన వారు ఆ తర్వాత తినడానికి కూడా తిండి లేకుండా ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు.. మరి కొంతమంది కట్టు బట్టలతో ఇండస్ట్రీలోకి వచ్చి ఆ తర్వాత కోట్లు గడించిన వారు కూడా ఉన్నారు.. అయితే ఇక్కడ ఒక హీరో మాత్రం ఎంతో మంది అమ్మాయిల కలల రాకుమారుడిగా .. స్టార్ హీరోగా పేరు దక్కించుకొని.. ఆ తర్వాత సినిమా అవకాశాలు లేక ఆర్థికంగా చితికిపోయి బాత్రూంలు కూడా కడిగిన సందర్భాలు ఉన్నాయి .మరి వారెవరో ఇప్పుడు చూద్దాం..

Star Hero:Once upon a time Romance with Aishwarya.. but now bathroom cleaner..!
Star Hero:Once upon a time Romance with Aishwarya.. but now bathroom cleaner..!

ఒకప్పుడు ఐశ్వర్యతో రొమాన్స్..

1990 కాలంలో ఒక వెలుగు వెలిగి .. కళ్ళు చెదిరే స్టార్డం తెచ్చుకున్న హీరో అబ్బాస్.. చెడు నిర్ణయాల వల్ల కెరియర్నే నాశనం చేసుకున్నారు.. ఇప్పుడు ఎవరికీ కనిపించకుండా.. ఎవరికి గుర్తుకురాని పరిస్థితుల్లో జీవిస్తున్నారు.. ప్రేమదేశం సినిమాతో అమ్మాయిలకు డ్రీమ్ బాయ్ గా మారిన అబ్బాస్ 90’S సూపర్ స్టార్ గా పేరు దక్కించుకున్నారు ..అయితే అదే సమయంలో నాలుగు సార్లు దివాలా తీశాడు.. పొట్టకూటి కోసం టాక్సీ డ్రైవర్ గా, టాయిలెట్ క్లీనర్ గా కూడా పనిచేశారు.. ప్రియురాలు పిలిచింది సినిమాలో ఐశ్వర్యారాయ్ వంటి విశ్వసుందరితో రొమాన్స్ చేసిన ఈయన ఇలా టాయిలెట్ క్లీనర్ గా మారి అందరిని ఆశ్చర్యపరిచారు.. టబు , రజనీకాంత్, మమ్ముట్టి వంటి స్టార్ హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుని ఇప్పుడు గ్లామర్ ప్రపంచానికి దూరంగా జీవిస్తున్నారు

ఇంజనీర్ అవ్వాల్సిన వారు యాక్టర్ అయ్యారు.

అబ్బాస్ ను తన తండ్రి హీరోని కాకుండా ఇంజనీర్గా చూడాలని అనుకున్నారట. అందుకే ఇంజనీరింగ్ కాలేజీలో కూడా చేర్పించారు.. కానీ అబ్బాస్ మాత్రం 1994లో బెంగళూరులో ఒక మోడలింగ్ కాంపిటీషన్ జరుగుతుందని తెలుసుకొని అందులో పాల్గొన్నారు. అబ్బాస్ ఆ కాంపిటీషన్లో గెలిచారు కూడా.. ఇక అదే ఆయన సినిమా కెరియర్ కు నాంది అయింది.. మోడలింగ్ లోకి అడుగుపెట్టిన అబ్బాస్ 1995లో ఒక స్నేహితుడి సలహా మేరకు తమిళ్ సినిమా ఆడిషన్ కి వెళ్ళాడు. ఆయన నటన చూసి ముగ్ధుడైన దర్శకుడు కాదీర్ కాదల్ దేశం అనే సినిమా స్క్రీన్ టెస్ట్ కి ఆహ్వానించారు. అదే తెలుగులో ప్రేమదేశం.. టెస్ట్ పాస్ అవడంతో అబ్బాస్ కి అవకాశం లభించింది.. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో అబ్బాస్ కూడా సూపర్ స్టార్ గా మారిపోయారు.

- Advertisement -

బాత్రూంలు కూడా కడిగారు..

ఇకపోతే కెరియర్ దూసుకుపోతున్న నేపథ్యంలో కొంత కాలానికి పతనమవడం మొదలయ్యింది.. దీంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టారు. ఇక 2015లో సినిమాలు వదిలేసి న్యూజిలాండ్ కు వెళ్లిపోయారు.. అక్కడ డబ్బులు లేక బైకు మెకానిక్ గా, పెట్రోల్ బంకులో పనిచేయడమే కాదు టాయిలెట్ క్లీనర్ గా ,ట్యాక్సీ డ్రైవర్ గా కూడా పనిచేశారు. ప్రస్తుతం మోటివేషనల్ స్పీకర్గా పనిచేస్తున్నారు.

అబ్బాస్ చిత్రాలు..

2000 సంవత్సరంలో హే రామ్, ఆనందం, మిన్నలే వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి సూపర్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.. అయితే ఏ సినిమా సక్సెస్ కూడా ఇప్పుడు ఈయనకు అవకాశాలను ఇవ్వలేకపోతోంది. మొత్తానికైతే ఒకప్పుడు సూపర్ స్టార్ స్టేటస్ ని అనుభవించి ఇప్పుడు దీనస్థితికి చేరుకోవడం నిజంగా బాధాకరమని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు