6Years For BharatAneNenu : భరత్ ప్రమాణస్వీకారానికి నేటికీ సరిగ్గా ఆరేళ్ళు..

6Years For BharatAneNenu : భరత్ అనే నేను.. ఈ సినిమాకు మహేష్ బాబు కెరీర్ లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అప్పటివరకు మహేష్ ని మాస్ రోల్స్ లో, క్లాస్ రోల్స్ లోనూ చూసిన ఫ్యాన్స్ కి, మహేష్ ని పూర్తిగా మార్చేసి కంప్లీట్ మేకోవర్ తో ఒక డీసెంట్ మహేష్ బయట ఎలా ఉంటాడో అలా చూపించేసాడు దర్శకుడు కొరటాల. అప్పటివరకు వరుస ప్లాపుల్లో ఉన్న మహేష్ కి భరత్ అనే నేను ఊపిరినిచ్చింది. ఈ సినిమాలో మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అన్నిటికి మించి ఈనాటి రాజకీయ పరిస్థితులకు, ప్రజల స్థితిగతులకు అద్దం పట్టేలా తెరకెక్కిన భరత్ అనే నేను ఫ్యాన్స్ తో పాటు తెలుగు సినీ ప్రేక్షకులకు చాలా ఫేవరేట్. ఈ సినిమా విడుదలై నేటికీ (6Years For BharatAneNenu) (ఎప్రిల్ 20) సరిగ్గా ఆరేళ్ళు. ఈ సందర్బంగా భరత్ అనే నేను సినిమా విశేషాలపై ఓ లుక్కేద్దాం.

కథ విషయానికి వస్తే..

సమైఖ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హఠాన్మరణంతో పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన వరదరాజులు నిర్ణయం మేరకు, అప్పుడే లండన్ నుంచి తండ్రిని కడసారి చూడడానికి ఇండియాకి వచ్చిన కొడుకు భరత్, తండ్రి అంత్యక్రియల తర్వాత వెళ్లిపోదామనుకుంటుండగా, అప్పటికప్పుడు భరత్ ని ముఖ్యమంత్రిగా చేసి, ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అయితే చిన్నప్పుడే లండన్ వెళ్ళిపోయి భారతదేశానికి దూరంగా పెరిగిన భరత్ కు ఇక్కడి ప్రజలు, వ్యవస్థ, పద్ధతులు అసలు నచ్చవు. పాలనతో మార్పులు తీసుకురావాలంటే వ్యవస్థ మారాలి. అంటే ప్రజలు బాధ్యాతాయుతంగా వ్యవహరించాలి. వారికి ఆ బాధ్యత తెలియాలంటే వారిలో భయం ఉండాలి. అందుకే ముఖ్యమంత్రి భరత్ ప్రజల్లో మార్పు తీసుకురావడం కోసం మొదట్లోనే ట్రాఫిక్ రూల్స్ పాటించనివారిపై భారీ మొత్తంలో ఫైన్లు వేస్తారు. భయంతో రూల్స్ ఫాలో అవ్వడం మొదలెడతారు జనాలు. అదే తరహాలో.. కాంట్రాక్టర్లు, మీడియేటర్ల మీదనే కాకుండా, ప్రతిపక్ష నేతలపై కూడా ప్రయోగించాలని ప్రయత్నించి విఫలమవుతాడు. ప్రజల కోసం పనిచేయాల్సిన రాజకీయ నాయకులు ప్రజలను దోచుకుంటున్నారని తెలుసుకొని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్న భరత్ ని సొంత పార్టీవారే గద్దె దించుతారు . ఒక్కసారిగా శక్తిహీనుడు అయిన భరత్ ఆ రాజకీయ మూకలను ఎలా ఎదుర్కొన్నాడనాడు. అంత:కారణ శుద్ధితో ప్రజలను ప్రగతిబాటవైపు ఎలా నడిపించాడు అనేది కథ.

ఇక యువ ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ బాబు చాలా స్టైలిష్ గా డీసెంట్ గా నటించడమే కాకూండా, బాధ్యతగా కనిపించాడనిపిస్తుంది. స్పెషల్ గా ఆ బాడీ లాంగ్వేజ్ ని చుస్తే ఒక ఎడ్యుకేటెడ్ నాయకుడు ఎలా ఉంటాడో ఎలా ఉంటాడు. ఇక సినిమాలో దుర్గా మహల్ ఫైట్ సీన్, ప్రెస్ మీట్ సీన్స్ లో మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్ లో రేంజ్ లో ఉంటుంది. ఇక హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీకి పెద్దగా సన్నివేశాలు లేకపోయినప్పటికీ, ఉన్నంత సేపు ఆకట్టుకొంది.

- Advertisement -

భారీ బ్లాక్ బస్టర్ గా భరత్ అనే నేను..

ఇక ఎప్రిల్ 20 2018 న విడుదలైన భరత్ అనే నేను (6Years For BharatAneNenu) మహేష్ కెరీర్ లోనే ఆ నాటికి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకోవడం జరిగింది. బ్రహ్మోత్సవం, స్పైడర్ వంటి డిజాస్టర్లతో హిట్ కొట్టక తప్పనిపరిస్థితుల్లో ఉన్న మహేష్ కి ఊపిరినిచ్చింది ఈ సినిమా. ఇక భరత్ అనే నేను సినిమా దాదాపు 95 కోట్లకి పైగా షేర్ సాధించగా దాదాపు 165 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నైలిచింది. ఇక మహేష్ బాబు కొరటాల శివ కాంబోలో అంతకు ముందే శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు