Mahesh Babu : ఇంటర్నేషనల్ రేంజ్ లో కుర్చీ మడతపెడుతున్నాడుగా!

Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ అయి మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుందన్న సంగతి తెలిసిందే. నిజానికి సినిమా కంటెంట్ అంత బాగా లేకపోయినా మహేష్ బాబు వన్ మ్యాన్ షో గా సాగిన ఈ సినిమా ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా ఆడడానికి ప్రధాన కారణాల్లో మహేష్ బాబు అల్టిమేట్ పెర్ఫార్మన్స్ ఒక కారణమైతే, పాటలు కూడా మరో కారణం అనొచ్చు. ముఖ్యంగా గుంటూరు కారం లో ‘కుర్చీ మడతబెట్టి’ సాంగ్ ఇండియా వైడ్ గా ఓ రేంజ్ లో ఊపేసింది. మహేష్ బాబు ఈ సాంగ్ లో కెరీర్ లోనే బెస్ట్ అనేలా డ్యాన్స్ చేసాడు. శ్రీలీల డాన్స్ లో స్పెషలిస్ట్ అయినా, మహేష్ కోసమే ఆడియన్స్ చూశారంటే అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ పాట యూట్యూబ్ లో రిలీజ్ అయ్యాక అంతకు మించి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. కుర్చీ మడతబెట్టి పాట సోషల్ మీడియాను తుఫానులా ఆకట్టుకుంది. మహేష్ మరియు శ్రీలీల నటించిన ఎనర్జిటిక్ ట్రాక్ కి తోడు, దాని సాహిత్యం, మాస్ డ్యాన్స్ మూవ్‌ లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఆ ఫీవర్ ఏకంగా ఆఫ్రికా ఖండానికి కూడా విస్తరించింది.

ఇంటర్నేషనల్ లెవెల్లో కుర్చీ మడతబెట్టి..

మహేష్ బాబు (Mahesh Babu) కుర్చీ మడతబెట్టి సాంగ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో దూసుకుపోతుంది. అయితే చాలా మంది ఆఫ్రికన్ పిల్లలు ఇప్పుడు Instagram రీల్స్ వంటి ప్లాట్‌ ఫారమ్‌లలో పలు ఇండియన్ సాంగ్స్ ని రీల్స్ చేయడం చూస్తూనే ఉంటాం. అలాగే ఆ పాటలకు వారి వెర్షన్‌లను సృష్టిస్తున్నారు. USAలోని హ్యూస్టన్‌లో NBA గేమ్ సందర్భంగా జరిగిన ఫ్లాష్ మాబ్ ఈవెంట్‌లో ఈ పాటకు డ్యాన్స్ మాబ్ ప్రదర్శన ఇవ్వడం చూసిన తర్వాత, ఇప్పుడు ఉగాండాకు చెందిన ఆఫ్రికన్ పిల్లల రీల్స్ వచ్చాయి. ఆ రీల్స్ లో మహేష్ బాబు కుర్చీ మడతబెట్టి సాంగ్ కి చేసిన డాన్స్ సూపర్ గా ఆకట్టుకుంటుంది. చాలా మంది మహేష్ బాబు ఫ్యాన్స్ దీన్ని షేర్ చేస్తున్నారు. వారు తమన్ ట్యూన్స్ కి అనుగుణంగా తమ డ్యాన్స్ శైలిని చక్కగా చేసారు. అసలు డ్యాన్స్ మూవ్‌లను తీసుకొని వాటికి అనుగుణంగా మౌల్డ్ చేశారు. ఇక ఈ పిల్లల్ని స్మాష్ టాలెంట్ ఫౌండేషన్ చూసుకుంటుంది.

- Advertisement -

యూట్యూబ్ లో రచ్చ..

ఇక మహేష్ బాబు కుర్చీ మడతబెట్టి సాంగ్ యూట్యూబ్ లో 200 మిలియన్ల వ్యూస్ దిశగా దూసుకుపోతుంది. ఇక లైక్స్ పరంగా ఏకంగా 1.5 మిలియన్లను సొంతం చేసుకుంది. అయితే ఇంటర్నేషనల్ వైడ్ గా మన పాటలు వైరల్ అవడం ఎప్పట్నుంచో ఉంది. ఆ మధ్య అల వైకుంఠపురంలో సినిమాలో బుట్ట బొమ్మా పాట ఇలా వైరల్ అవ్వడం మనం చూసే ఉన్నాం. వివిధ దేశాల ప్రముఖులు మరియు వ్యక్తులు దాని రీల్స్ చేయడం, అలాగే ఇప్పుడు కుర్చీ మడతపెట్టి కోసం కూడా, ఇప్పటికే చాలా మంది సెలెబ్స్ తమ రీల్‌ ను చేసారు. ఇక కొంతమంది క్రికెటర్లు కూడా ఈ ట్రెండ్‌ను పెంచారు. ఇక గుంటూరు కారం ఈ మధ్యనే టెలివిజన్ లో జెమినీటీవీ ఛానెల్ లో టెలికాస్ట్ అవగా, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు