Pushpa 2 Hindi : అప్పుడే అంచనాలు మొదలు.. ఫస్ట్ డే కలెక్షన్స్..!

Pushpa 2 Hindi : అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో 2021 లో వచ్చిన చిత్రం పుష్ప.. ఈ సినిమా బాలీవుడ్ లో ఎటువంటి అంచనాలు లేకుండా.. ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా విడుదలై అక్కడ రూ.100 కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించింది.. దీంతో సౌత్ ఆడియన్స్ కంటే నార్త్ ఆడియన్స్ ఎక్కువగా పుష్ప -2 కోసం ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న పుష్ప -2 సినిమా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో అప్పుడే మొదటి రోజు కలెక్షన్స్ అంటూ ఒక అంచనా కి వస్తున్నారు సినీ లవర్స్..

Pushpa -2 (Hindi):Then the expectations start.. First day collections..!
Pushpa -2 (Hindi):Then the expectations start.. First day collections..!

పుష్ప -2 ఫస్ట్ డే కలెక్షన్స్ :

అల్లు అర్జున్ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా పేరు దక్కించుకోవడమే కాదు జాతీయ ఉత్తమ నటుడిగా కూడా అవార్డు అందుకొని చరిత్ర సృష్టించారు.. జాతీయ అవార్డు రావడంతో పుష్ప సినిమా క్రేజ్ ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ లో మారుమ్రోగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు అందరూ పుష్ప ది రూల్ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. ఈ చిత్రానికి మొదటి రోజు ఓపెనింగ్స్ ఎలా వస్తాయనే అంచనాలు కూడా అప్పుడే మొదలయ్యాయి.. మరీ ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో ఫస్ట్ డే ఎంత వసూలు చేసే అవకాశం ఉందనే విషయంపై అప్పుడే డిస్కషన్స్ కూడా మొదలయ్యాయి.. అక్కడి ట్రేడ్ లెక్కలు..అంచనాలు వేస్తోందని చెప్పవచ్చు. సినిమా మీద ఉన్న హై ఎక్స్పెక్టేషన్స్ నేపథ్యంలో మొదటి రోజు హిందీ బెల్ట్ లో ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సుమారుగా రూ.60 కోట్లు వసూలు చేస్తుందని అంచనాలు వినిపిస్తున్నాయి..

ఆ రికార్డు బ్రేక్ చేయగలదా..

ఈ నేపథ్యంలోనే గతంలో సౌత్ నుంచి వచ్చి నార్త్ లో కలెక్షన్స్ తో దుమ్మురేపిన సినిమాలను గుర్తు చేసుకుంటున్నారు ఆడియన్స్.. ఇకపోతే సౌత్ సినిమాలు హిందీ బెల్టులో మొదటి రోజు హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాలంటే ఇప్పుడు నెంబర్ వన్ స్థానంలో కేజీఎఫ్ చాప్టర్ 2 ఉంది. ఈ సినిమా ఏకంగా మొదటి రోజు రూ .52.39 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. అలాగే నంబర్ 2 స్థానంలో బాహుబలి 2 నిలిచింది. ఈ సినిమా మొదటి రోజు రూ.40.73 కోట్ల వసూలు చేయగా.. ప్రభాస్ సాహో సినిమా రూ.25.82 కోట్లు మొదటి రోజు వసూలు చేసింది. అలాగే రోబో 2.0 సినిమా రూ .19.74 కోట్లు వసూలు చేసింది. సో మొత్తంగా చూసుకుంటే కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా రికార్డును ఇప్పటివరకు ఏ సౌత్ సినిమా కూడా బ్రేక్ చేయలేదు. ఇప్పుడు ఈ రికార్డును బ్రేక్ చేయడానికి పుష్ప 2 సినిమా రాబోతోందని అభిమానులు అంచనాలు వేస్తున్నారు.

- Advertisement -

బన్నీ వల్లే సాధ్యం..

ఇకపోతే పుష్ప ది రూల్ సినిమాపై ఉన్న హైప్ తో ఖచ్చితంగా నార్త్ ఇండియాలో రూ .60 కోట్లకు పైగా మొదటి రోజు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి ఈ అంచనాలు నిజమైతే ఇక అల్లు అర్జున్ ని ఢీకొట్టే హీరో మరొకరు లేరు అని చెప్పడంలో సందేహం లేదు. మరొకవైపు ఇదే సినిమాకి పోటీగా బాలీవుడ్లో అజయ్ దేవగన్ సింగం ఎగైన్ సినిమా కూడా రిలీజ్ అవుతుందని సమాచారం.. మరి ఈ రెండు సినిమాల మధ్య పోటీ అక్కడ ఏ సినిమాకు భారీ ఓపెనింగ్స్ తీసుకువస్తాయో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు