Mrunal Thakur: కోట్లలో రెమ్యూనరేషన్ వస్తున్నా.. నేను పిసినారిని!

Mrunal Thakur: సినీ పరిశ్రమలో పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు మృణాల్ ఠాకూర్. ఒక్క సినిమాతోనే అందరి చూపు తన వైపుకు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. సీతారామం సినిమాతో నటనపరంగా మంచి మార్కులు కొట్టేసింది. అప్పటినుండి ఈమెకు భారీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. సీతారామం సినిమా తర్వాత నానికి జోడిగా “హాయ్ నాన్న” సినిమాతో ఆకట్టుకున్న మృణాల్.. తాజాగా విజయ్ దేవరకొండకి జోడిగా ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.

ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అయ్యారు. ఇక మృణాల్ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోల గురించి మనందరికీ తెలిసిందే. రోజురోజుకూ తన అందాల ప్రదర్శనలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగు, తమిళ్, హిందీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టడంతో రెమ్యూనరేషన్ పెంచేసిందని తెలుస్తోంది.

అయితే కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న మృణాల్ మాత్రం చాలా పిసినారి. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ స్వయంగా వెల్లడించింది. “కెరీర్ తొలినాళ్లలో నేను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాను. ఇప్పటికీ నేను షాపింగ్ చేస్తే ఖర్చు రెండు వేలకు మించదు. నాకు కోట్లలో రెమ్యునరేషన్ వస్తున్నప్పటికీ ఖర్చులో మాత్రం పిసినారిని” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు