Satyam Rajesh : తెగ బిజీ అయిపోతున్న రాజేష్.. అంత దాని వల్లే..

Satyam Rajesh : టాలీవుడ్ లో సత్యం సినిమాతో నటుడిగా పాపులర్ అయి, ఆ సినిమాతోనే సత్యం రాజేష్ గా ఇండస్ట్రీ లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యం రాజేష్. ఆ తర్వాత చాలా సినిమాల్లో హీరో ఫ్రెండ్ గా, పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ, అలాగే మరి కొన్ని సినిమాల్లో విలన్ పక్కన అసిస్టెంట్ గానూ నటిస్తూ వచ్చాడు సత్యం రాజేష్. అయితే మూడేళ్ళ కింద వచ్చిన మా ఊరి పొలిమేర చిత్రం సత్యం రాజేష్ కెరీర్ ని మరో మలుపు తిప్పిందని చెప్పొచ్చు. ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా నటించిన సత్యం రాజేష్ చేతబడులు చేసే వాడిగా నటించాడు. సినిమాకి తన పాత్రే బలం అన్న రేంజ్ లో ఆడియన్స్ ని కట్టిపడేసాడు. ఇక ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన రాజేష్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ఏకంగా హీరోగానూ సినిమాలు చేస్తూ బిజీ అవుతున్నాడు రాజేష్. తాజాగా టెనెంట్ అనే చిత్రంలో హీరోగా నటించగా తాజాగా ట్రైలర్ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

హీరోగా టెనెంట్..

పొలిమేర తర్వాత సత్యం రాజేష్ (Satyam Rajesh) టెనెంట్ లో హీరోగా నటించగా, లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ ట్రైలర్ ని చూడగా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిందని తెలుస్తుంది. ట్రైలర్ లో చూపించిన కంటెంట్ కూడా చాలా ఎక్సయిటింగ్ గా వుంది. ట్రైలర్ లో పోలీస్ ‘నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయిని నువ్వే చంపేయడం ఏమిటి? అని ప్రశించగా.. ‘రావణాసురుడు సీతని చెరబడితే శిక్ష సీతకెందుపడింది?’ అని సత్యం రాజేష్ ఎదురు ప్రశ్నించడం పై కథ పై మరింత క్యురియాసిటీని పెంచింది. ఇక ట్రైలర్ లో ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు సత్యం రాజేష్. వై. యుగంధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ను మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. ఏప్రిల్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఇక ముందు హీరోగా వరుస సినిమాలతో..

అయితే పొలిమేర కి ముందు కూడా సత్యం రాజేష్ పలు సినిమాల్లో హీరోగా నటించాడు. నాయకి లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో హీరోగా సెకండ్ లీడ్ చేసాడు. అయితే అప్పట్లో హీరోగా నటించిన సినిమాలేవీ సక్సెస్ కాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కొనసాగాడు. అయితే పొలిమేర సక్సెస్ తో సత్యం రాజేష్ సెకండ్ ఇన్నింగ్స్ సరికొత్తగా స్టార్ట్ చేసాడని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూనే హీరోగానూ సినిమాలు చేద్దామని ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది. అప్పట్లో అలీ లాంటి కమెడియన్లు హీరోలుగా చేస్తూనే, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, కమెడియన్లు గా కొనసాగారు. ఏది ఏమైనా సత్యం రాజేష్ కి పొలిమేర సినిమా వల్ల ఇప్పుడు హీరోగా కూడా ఛాన్సులు వస్తున్నాయని చెప్పొచ్చు. ఇక త్వరలో పొలిమేర పార్ట్ 3 కూడా రానుండగా, సత్యం రాజేష్ పలు సినిమాల్తో ఇప్పటికే తెగ బిజీ అయ్యాడు. అయితే ప్రస్తుతం టెనెంట్ మూవీ పప్రమోషన్లలో బిజీ అయ్యాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు