Kaatera: ఓటీటీలో సత్తా చాటడానికి సిద్ధమైన కాటేరా..?

Kaatera.. కన్నడ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. ముఖ్యంగా సరికొత్త విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను కూడా అబ్బురపరిచేలా కనిపిస్తున్నాయి. అలా ఇప్పటివరకు కాంతారా, విక్రాంత్ రోనా, కేజీఎఫ్ 1,2 ,వేద తదితర చిత్రాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. గత ఏడాది కన్నడలో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న కాటేరా సినిమా మొదట పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయాలని భావించినప్పటికీ.. ప్రభాస్ నటించిన సలార్ సినిమా పోటీ ఉండడం చేత కేవలం కన్నడలో మాత్రమే ఈ చిత్రాన్ని విడుదల చేశారు.

Kaatera:Katera is ready to show her strength in OTT..?
Kaatera:Katera is ready to show her strength in OTT..?

ఓటీటీ కి సిద్ధమైన కాటేరా..
అయినప్పటికీ కూడా కన్నడలో ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.. ఇందులో హీరో దర్శన్ నటించగా.. హీరోయిన్ గా ఆరాధన రామ్ నటించింది. అలాగే ఇందులో టాలీవుడ్ హీరో జగపతిబాబు, వినోద్ కుమార్ వంటి వారు కీలకమైన పాత్రలలో నటించారు. థియేటర్లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న కాటేరా సినిమా ఓటీటీ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ Zee -5 ఈ సినిమా డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కన్నడ వర్షన్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

తెలుగు వెర్షన్ కి సిద్ధం..
కానీ ఇప్పుడు తాజాగా తెలుగు వర్షన్ ను కూడా ఓటీటీ లోకి తీసుకువచ్చింది.. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా తెలుగు, తమిళ్ వర్షన్ లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్ధ జీ ఫైవ్.. ఈ విషయాన్ని అధికారికంగా ఓటీటి సంస్థ ప్రకటించింది.. విడుదలైన ఐదు నెలల తర్వాత కాటేరా చిత్రం తెలుగు వర్షన్ లో స్ట్రిమింగ్ కి రావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు..

- Advertisement -

కాటేరా సినిమా స్టోరీ..
కాటేరా సినిమా స్టోరీ విషయానికి వస్తే..1970 విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో ఈ సినిమాని ఒక పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా డైరెక్టర్ తరుణ్ సుదీర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని 45 కోట్ల రూపాయల బడ్జెట్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని నటీనటుల విషయానికే వస్తే పద్మా వసంతి, శ్రీనివాసమూర్తి, అజిత్ కుమార్ తదితరులు సైతం నటించారు. ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను సైతం బాగా అలరిస్తుందని చెప్పవచ్చు.

హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ ఇదే..
కాటేరా సినిమాలో ఆరాధన రామ్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే .. ఇక ఈమె ఎవరో కాదు అలనాటి అందాల తార మాల శ్రీ కూతురే ఈ ఆరాధన రామ్.. శాండిల్ వుడ్ లోకి హీరోయిన్ గా ఈ సినిమాతోనే అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.. 1970 బ్యాక్ డ్రాప్లో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు తరుణ్ సుధీర్ కాటేరా మూవీ ని సరే తెరకెక్కించారు. మరో నెగెటివ్ షేడ్ పాత్రలో సీనియర్ హీరో వినోద్ కుమార్ కనిపించారు. ఈ చిత్రాన్ని రాక్ లైన్ వెంకటేష్ నిర్మించారు.మరి ఈ సినిమా తెలుగులో ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు