Soundarya Jagadish Died: అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ప్రముఖ నిర్మాత.. అసలేం జరిగింది?

Soundarya Jagadish Died: కన్నడ సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త సౌందర్య జగదీష్ మరణించారు. అయితే ఆయన మృతిపై రకరకాలుగా కామెంట్స్ వినిపించడం చర్చనియాంశంగా మారింది. ఆయన తొలుత గుండెపోటుతో చనిపోయారని వార్తలు వినిపించగా.. కుటుంబ సభ్యులు మాత్రం ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని క్లారిటీ ఇచ్చారు. అయితే ఆయనకి ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం ఏమిటి..? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా ఆయన ఇంట్లో గడిచిన రెండు నెలలలో రెండు మరణాలు చోటు చేసుకోవడం గమనార్హం. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?

గత నెలలో ఆయన సెక్యూరిటీ గార్డు మరణించగా.. రెండు వారాల క్రితం ఆయన అత్తగారు మరణించారు. ఇప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సౌందర్య జగదీష్ మరణంపై సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు జగదీష్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. జగదీష్ ఆదివారం ఉదయం ఉరి వేసుకోగా.. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియ రాలేదు.

జగదీష్ ఆరోగ్యం, వ్యాపారాలలో ఎలాంటి సమస్యలు లేవని.. పోలీసులకు సమాచారం అందించామని ఆయన స్నేహితుడు శ్రేయస్ ధ్రువీకరించారు. ఆయన మృతి పట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జగదీష్ మస్త్ మజా మాది, స్నేహితారు తదితర చిత్రాలను నిర్మించారు. అప్పు – పప్పు సినిమాతో ఆయన కొడుకుని కూడా హీరోగా పరిచయం చేశారు. సినిమాల నిర్మాణంతో పాటు జగదీష్ ఇండస్ట్రియలిస్ట్ కూడా. అయితే పోలీసుల విచారణలో జగదీష్ ఆత్మహత్య వెనక ఉన్న కారణం ఏంటన్న దానిపై స్పష్టత వచ్చే వీలు ఉందన్నమాట వినిపిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు