Tabu: అవే నా ప్రపంచం అంటున్న టబు!

Tabu: సీనియర్ స్టార్ హీరోయిన్ టబు గురించి ఇప్పటి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ కాస్త ముందు జనరేషన్ ని అడిగితే ఆమె యాక్టింగ్ గురించి చెబుతారు. అప్పట్లో ఈమె తెలుగులో ఎన్నో హిట్ సినిమాలలో నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ నాగార్జున వంటి స్టార్ హీరోల సినిమాలలో ఈమె నటించి ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తరువాత ఎక్కువగా బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ.. అప్పుడప్పుడు తెలుగు సినిమాలలో నటిస్తూ వస్తోంది.

ఈమె చివరిగా తెలుగులో నటించిన చిత్రం అల వైకుంఠపురములో. టబు 50 ఏళ్ల వయసులో కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తుంది. ఇటీవలే కరీనాకపూర్, కృతి సనన్ తో కలిసి ఎయిర్ హోస్ట్ గా “క్రూ” చిత్రంలో నటించినది. ఈ కామెడీ సినిమాలో టబు నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టబు తన బాల్యాన్ని గుర్తుచేసుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

“నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే. నా పూర్తి పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మి. నా తండ్రి పాకిస్తాన్ నటుడు. పేరు జమాల్ అలీ హస్మి. తల్లి పేరు రిజ్వానా. చిన్నప్పుడే మా అమ్మ నుంచి విడిపోయాను. అప్పుడు మా అమ్మమ్మతో కలిసి హైదరాబాద్ నుంచి మనాలికి వెళ్ళిపోయాం. అక్కడ నా ప్రపంచం రెండు పెంపుడు కుక్కలు, చేపలు. ఆ సమయంలో అవే నా ప్రపంచం. మా అమ్మమ్మ దగ్గర నాకు ప్రపంచం అర్థమైంది. ఇప్పటివరకు 92 చిత్రాలలో నటించాను” అని చెప్పుకొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు