Honey Rose: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలయ్య బ్యూటీ..!

Honey Rose..ఇండస్ట్రీలో ఏ హీరో అయినా సరే సక్సెస్ కావాలి అంటే కేవలం ఒక్క సినిమా చాలు అని చెప్పవచ్చు. అలా మలయాళ ముద్దుగుమ్మ హనీ రోజ్ రేంజ్ కూడా బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా మారిపోయింది.. అయితే హనీరోజ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు అయింది. ముఖ్యంగా గతంలో శివాజీతో కలిసి ఆలయం అనే సినిమాలో కూడా నటించింది. ఆ తర్వాత “ఈ వర్షం సాక్షిగా” అని మరో సినిమాలో కూడా నటించింది హనీ రోజ్.. ఇవేవీ కూడా ఈమెకు క్రేజీ తెచ్చి పెట్టలేదు.

Honey Rose:Balayya's beauty has changed beyond recognition..!
Honey Rose:Balayya’s beauty has changed beyond recognition..!

సినిమాల కంటే షాపింగ్ మాల్స్ తోనే బిజీ..

దీంతో చేసేదేమీ లేక మళ్ళీ మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ మంచి మంచి చిత్రాలలో నటించి భారీ గా క్రేజ్ సంపాదించింది. మలయాళ సినిమాలలో ఎన్నో రొమాంటిక్ సన్నివేశాలలో రెచ్చిపోయి మరి నటించింది హనీ రోజ్. వీరసింహారెడ్డి సినిమాతో మాత్రం హనీ రోజ్ ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుంది. ఇక అప్పటినుంచి కుర్రకారు ఈమె అంటే పడి చస్తున్నారు.. సినిమాలలో కంటే షాపింగ్ మాల్స్ తోనే బిజీగా గడిపేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Honey Rose:Balayya's beauty has changed beyond recognition..!
Honey Rose:Balayya’s beauty has changed beyond recognition..!

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హనీరోజ్..

హనీరోజ్ ఇప్పుడైతే కాస్త బొద్దుగా కనిపిస్తున్నప్పటికీ గతంలో హనీ రోజ్ ను చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. గతంలో ఉన్న ఫోటోలను.. ఇప్పుడున్న ఫోటోలను చూస్తే మాత్రం వేరు వేరా అనే డౌటు కూడా వస్తుంది. పై ఫోటోలో కనిపిస్తున్నది హీరోయిన్ హనీ రోజ్. 2005లో నటిగా తన కెరీర్ ని మొదలు పెట్టిన హనీ రోజ్ ప్రస్తుతం ఆమె వయసు 32 సంవత్సరాలు.. 13 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హానీ రోజ్ ఆమెకు పెద్దగా గుర్తింపు అయితే రాలేకపోయింది. అలా హనీ రోజ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలోవి ఈ ఫోటోలట. అప్పట్లో సన్నజాజిలా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ముట్టుకుంటే కందిపోయేంత సుకుమారంగా మారిపోయింది.. హనీరోజ్ కి సంబంధించి ఫోటోలు, వీడియోలు సైతం అభిమానులను తెగ పిచ్చెక్కించేలా చేస్తున్నాయి.హనీ రోజ్ అందానికి సైతం ఎంతోమంది కుర్రకారులు మంత్రముగ్ధులవుతున్నారు.

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీకి దూరమేనా..

వీరసింహారెడ్డి సినిమా విడుదల అయ్యి ఇప్పటికి ఏడాది పైనే కావస్తున్నా ఇప్పటి వరకు తన తదుపరి చిత్రాన్ని మాత్రం ఇంకా తెలుగులో ప్రకటించలేదు. దీంతో ఆ ఈమె తెలుగు ఇండస్ట్రీకి దూరమేనా అంటూ అభిమానుల సైతం సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరి తెలుగులో ఈ ముద్దుగుమ్మకు ఏ మేరకు అవకాశాలు వస్తాయో చూడాలి..

మలయాళం లో అవకాశాలు..

హనీ రోజ్ మాత్రం మలయాళంలో పలు సినిమాలలో నటించడానికి సిద్ధమయ్యింది.. అక్కడ ఎలాంటి పాత్రలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతోంది అంతేకాదు గ్లామర్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో ఆమె ఫోటోలను షేర్ చేస్తూ హింట్ ఇస్తూ ఉంటుంది. మరి ఇలాగైనా ఈమెతో అవకాశాలు వస్తాయేమో చూడాలి మలయాళం సంగతి పక్కన పెడితే.. తెలుగులో ఈమె మళ్లీ నటించాలని.. ప్రాధాన్యత ఉన్న పాత్రతో మళ్ళీ ప్రేక్షకులను అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఏ మేరకు హనీరోజ్ అవకాశాలు అందుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు