Mahesh Babu – Namratha : మహేష్, నమ్రత గొడవ పడితే ఏం చేస్తారో తెలుసా?

Mahesh Babu – Namratha : టాలీవుడ్ లోని ఆడోరబుల్ కపుల్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత జంట ఒకటి. అయితే భార్యాభర్తలు అన్నాక ఇరువురి మధ్య చిన్నచిన్న గొడవలు, అలకలు కచ్చితంగా ఉంటాయి. సెలబ్రిటీ కపుల్స్ దీనికి మినహాయింపేమి కాదు. కానీ స్టార్స్ కాబట్టి వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా అభిమానులైతే తాము ఇష్టపడే నటీనటులకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలుసుకోవాలనే కుతూహలంతో ఉంటారు. ఇక విషయంలోకి వెళ్తే ఎప్పుడు చూసినా సంతోషంగా కనిపించే మహేష్ బాబు, నమ్రత మధ్య గొడవలు వస్తే ఏం చేస్తారు? అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? అయితే ఆ ప్రశ్నకు సమాధానమే ఈ ఆర్టికల్… ఇంకెందుకు ఆలస్యం ఓ లుక్కేయండి.

మహేష్, నమ్రత మధ్య గొడవలు వస్తే…

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ రొమాంటిక్ కపుల్ మహేష్ బాబు, నమ్రత. అయితే కామన్ గా భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు సర్దుకుపోతూ ఉంటారు. మరీ పెద్దదైతే పుట్టింటికి కూడా వెళ్ళిపోతుంటారు అమ్మాయిలు. కానీ మహేష్, నమ్రత మధ్య గొడవ జరిగితే మాత్రం వీళ్ళిద్దరూ చేసే పనులు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఒకవేళ మహేష్ మీద కోపం వచ్చిందంటే నమ్రత అలిగి షాపింగ్ కు వెళ్ళిపోతోందట. అలా తన కోపాన్ని తీర్చుకున్నాక మళ్ళీ మామూలు అయిపోతుంది. కానీ మహేష్ సారీ చెప్పే వరకు అతనితో ఒక్క మాట కూడా మాట్లాడదట.

ఇక మహేష్ బాబు విషయానికి వస్తే ఆయన గొడవలను కూడా రొమాంటిక్ గా మారుస్తారట. ఎప్పుడైనా నమ్రతతో గొడవ పడితే వెంటనే డిన్నర్ డేట్ లాంటివి ప్లాన్ చేసి ఆమె అలకను తీరుస్తాడట. ఈ విషయం తెలిసిన సూపర్ స్టార్ అభిమానులు అందుకే ఈ దంపతులు ఇంత ఇప్పటికీ ఇంత అన్యోన్యంగా ఉన్నారేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మహేష్ స్టైలిష్ మాత్రమే కాదు రొమాంటిక్ కూడా.

- Advertisement -

మహేష్ బాబు సినిమాలు

సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా గుంటూరు కారం మూవీతో థియేటర్లోకి వచ్చిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి అంతగా రెస్పాన్స్ దక్కలేదు. ఇక ప్రస్తుతం మహేష్, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందునున్న తన నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ SSMB 29పై దృష్టి పెట్టారు. ఈ భారీ అడ్వెంచరస్ మూవీ కోసం మహేష్ బాబు కసరత్తులు కూడా భారీగానే చేస్తున్నారు. మేకోవర్ ను పూర్తిగా మార్చడంతో పాటు దాదాపు 10 కేజీల బరువు తగ్గబోతున్నాడని టాక్ నడుస్తోంది. ఇక ఇప్పటిదాకా టాలీవుడ్ కే పరిమితమైన మహేష్ బాబు క్రేజ్ ను రాజమౌళి ఇంటర్నేషనల్ వైడ్ గా పెంచుతున్నారు. రీసెంట్ గా జపాన్ లో తానొక అందమైన స్టార్ తో సినిమా చేయబోతున్నానని, త్వరలోనే అతన్ని మీకు పరిచయం చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు