Samantha : డైరెక్టర్స్ కు సామ్ కండిషన్స్… ఇంకా స్టార్ హీరోయిన్ ఫీలింగ్ లోనే ఉందా?

Samantha : గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న సమంత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతోంది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో సమంత తన దగ్గరకు వస్తున్న మంచి అవకాశాలను ఒడిసి పట్టుకోకుండా, దర్శకులకు కండిషన్స్ పెడుతోందట. తన కండిషన్స్ కు ఓకే అంటేనే మూవీ చేయడానికి రెడీ అంటుందట ఈ బ్యూటీ. ఇంతకీ సామ్ కండిషన్ ఏంటి? అంటే…

సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కండిషన్స్ అప్లై

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సమంత టాలీవుడ్ ను ఏలింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక కూడా అడపా దడపా సినిమాల్లో కనిపించినా ఉపయోగం లేకుండా పోయింది. తర్వాత చైతన్య నుంచి విడాకులు తీసుకుని షాక్ ఇచ్చింది. అనంతరం శాకుంతలం వంటి సినిమాల్లో నటించినా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైనట్టు చెప్పి అభిమానులను కలవర పెట్టింది. ఆ వ్యాధి నుంచి కోలుకోవడానికి సినిమాలకు దాదాపు ఏడాది పైనే బ్రేక్ ఇచ్చి ప్రశాంతతను వెతుక్కుంటూ ప్రయాణాల బాట పట్టింది. మళ్ళీ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి దగ్గరవుతోంది. ఒకవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా మారడానికి ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేసింది.

ఈ నేపథ్యంలోనే సమంతను వెతుక్కుంటూ కొన్ని మంచి అవకాశాలు వస్తున్నాయని టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకు సమంతా నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. దానికి కారణం తన దగ్గరకు వస్తున్న దర్శకులకు కండిషన్లతో చుక్కలు చూపిస్తుందట సమంత. ఆమె మెయిన్ కండిషన్ ఏమిటంటే సినిమాలో తానే ఫస్ట్ హీరోయిన్ అయ్యి ఉండాలి. ఈ కండిషన్ కు ఒప్పుకుంటేనే ప్రాజెక్ట్ కు సైన్ చేస్తానని ముఖం మీద చెప్పేస్తుందట. ఇందులో ఎంతవరకు నిజం ముందో తెలియదు గానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త బాగా వైరల్ అవుతుంది.

- Advertisement -

దీంతో కొంతమంది ఈ అమ్మడు ఇంకా తను స్టార్ హీరోయిన్ అనే ఫీలింగ్లోనే ఉన్నట్టుంది అని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి సమంత గ్యాప్ ఇచ్చిన సమయంలో టాలీవుడ్లోకి ఆమెను మించిపోయిన రేంజ్ లో అందం, అభినయం ఉన్న హీరోయిన్లు వచ్చారు. కానీ ఒక్కరు కూడా ఇప్పటిదాకా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేసులో నిలకడగా నిలబడలేకపోయారు. మరోవైపు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా స్టార్ హీరోయిన్లు దూసుకెళ్తున్నారు. త్రిష, నయనతార వంటి హీరోయిన్లే అందుకు నిదర్శనం. వీరిద్దరూ ప్రస్తుతం సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా మారారు. మరి సమంత సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలాంటి సినిమాల్లో నటిస్తుందో చూడాలి.

సామ్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ఇవే

ప్రస్తుతానికి సమంత చేతిలో ఇండియన్ సిటాడెల్ ఉంది. బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్, సమంత ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలు పోషించారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పాపులర్ తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందునున్న పాన్ ఇండియా సినిమాలో సమంత హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు