Taapsee: ఫస్ట్ టైమ్ పెళ్లిపై అసలు గుట్టు విప్పిన తాప్సీ..!!

Taapsee.. తెలుగు సినీ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలలో నటించి ఆ తర్వాత ఇతర భాషలలో మెప్పించిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో తాప్సీ కూడా ఒకరు.. ఇటీవల ఈమె వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.. దాదాపుగా పదేళ్లపాటు బ్యాడ్మింటన్ ప్లేయర్ మథీయాస్ బోయ్ ను ప్రేమించి మరీ గడిచిన కొన్ని రోజుల క్రితం సీక్రెట్ గా వివాహం చేసుకుంది. వీరి వివాహం గత నెల 23వ తేదీన ఉదయపూర్ లో చాలా సింపుల్ గానే జరిగినట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియో కూడా ఇటీవలే వైరల్ గా మారింది.

పెళ్లిపై స్పందించిన తాప్సీ..
పెళ్లి పైన తాప్సీ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కేవలం తన స్నేహితుడు అభిలాష్ తాప్సీ పెళ్లి వేడుకకు , సంగీతానికి సంబంధించిన కొన్ని ఫోటోలను మాత్రమే గడిచిన కొద్ది రోజుల క్రితం షేర్ చేశారు. ఇటీవలే తాప్సీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తన పెళ్లి గురించి స్పందించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. తాప్సీ ఇలా మాట్లాడుతూ వివాహం అనేది తన వ్యక్తిగత విషయానికి సంబంధించిన విషయమని.. దాని గురించి అందరూ కూడా మాట్లాడుకోవడం తనకు పెద్దగా ఇష్టం లేదని కూడా వెల్లడించింది.

- Advertisement -

అందుకే చెప్పలేదు..
తన పర్సనల్ విషయాలను ఎవరితో కూడా చర్చించుకోకూడదనుకున్నాను.. అందుకే తన పెళ్లి గురించి ఎలాంటి ప్రకటన చేయలేదని కూడా తెలియజేసింది. అయితే ఇదంతా కేవలం తన ఆలోచన అన్నట్టుగా తెలియజేసింది. తన భర్తకు మరొక ఆలోచన ఉండవచ్చు అని.. తాను మాత్రం పెళ్లి గురించి సీక్రెట్ గా ఉంచాలనుకోవడం లేదనీ తెలిపింది.. మొత్తానికి తమ పెళ్లి వేడుకలలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఉన్నారని వెల్లడించింది. తమకు సంబంధించిన అన్ని విషయాలు కూడా వారికి తెలుసు అని , వారి యొక్క అంగీకారంతోనే తాము వివాహం చేసుకున్నామని తెలియజేసింది తాప్సీ..

ప్రశాంతంగా వున్నాను..
వివాహం అనేది ఎవరి జీవితంలోనైనా ఒక్కసారి మాత్రమే జరుగుతుంది.. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తూ ఉంటారు ..నా ఆలోచన ఇంతే అంటూ వివాహం గురించి ఎలాంటి ప్రణాళికలు లేవని కూడా తెలియజేసింది. కేవలం ప్రశాంతంగా పెళ్లి చేసుకోవాలనుకున్నానని.. అలాగే చేసుకున్నామని తెలిపింది. తన వివాహానికి సంబంధించిన ఎలాంటి ఫోటోలను వీడియోలను కానీ తాను షేర్ చేసుకోవడానికి మానసికంగా సిద్ధంగా లేనని కూడా తెలిపింది. రాబోయే రోజుల్లో అందుకు సంబంధించి ఫోటోలను , వీడియోలను షేర్ చేస్తానేమో తెలియదు కానీ తన చుట్టూ ఉన్నవాళ్లకు ఈ విషయం తెలుసు.. అందుకే తాను ప్రశాంతంగా ఉన్నానని తెలియజేసింది.ప్రస్తుతం తాప్సి చేసినటువంటి ఈ వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

తాప్సీ సినిమాలు..
తెలుగులో మొదటిసారి ఝుమ్మంది నాదం సినిమాలో నటించిన తాప్సీ. ఆ తర్వాత ప్రభాస్ నటించిన మిస్టర్ ఫర్ఫెక్ట్, రవితేజ నటించిన వీర, గోపీచంద్ సాహసం, మొగుడు తదితర చిత్రాలలో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించి తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పరచుకుంది తాప్సీ. మొత్తానికైతే తన పెళ్లిని సింపుల్గానే చేసుకోవడం ఇష్టం అంటూ చెప్పి తన పెళ్లి గురించి చెప్పింది ఈ ముద్దుగుమ్మ..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు