Mental Health Tips : ఈ లక్షణాలు కనిపిస్తే మీకు సైకియాట్రిస్ట్ హెల్ప్ అవసరం

Mental Health Tips : ప్రస్తుత తరానికి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. మానసిక ఆరోగ్యం సరిగ్గా లేకపోతే శారీరకంగా ఎంత హెల్దీగా ఉన్నా ఏం ఉపయోగం ఏముంటుంది? మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ చూపని వ్యక్తులు చాలా త్వరగా డిప్రెషన్ కు గురవుతారు అయితే చాలామంది మెంటల్ హెల్త్ గురించి పెద్దగా పట్టించుకోరు. మరి శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా కూడా హెల్దీగా ఉండాలి అనుకుంటే ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీ మానసిక అనారోగ్యానికి సంబంధించిన కొన్ని లక్షణాలను సకాలంలో గుర్తించకపోతే భవిష్యత్తులో తీవ్రమైన వ్యాధులుగా మారి, ప్రమాదకర పరిస్థితులను సృష్టిస్తాయి. మానసిక ఆరోగ్యం క్షీయించినప్పుడు శరీరంలో జరిగే మార్పులను గమనించి వెంటనే సైకాలజిస్టులను సంప్రదించాలి. అప్పుడే త్వరగా దాని నుంచి రికవరీ అవ్వచ్చు. డేంజరస్ గా మారి ప్రాణాల మీదకు తెచ్చే ఆ అన్ హెల్దీ మెంటల్ లక్షణాలు ఏంటి? అంటే..

1. మూడ్ స్వింగ్స్

మూడ్ స్వింగ్స్ అనేవి ప్రతి ఒక్కరిలోను సర్వసాధారణం. కానీ తరచుగా ఇలాంటి పరిస్థితి ఎదురైనా, లేదంటే కారణం లేకుండానే పదేపదే చిరాకుగా, విచారంగా, కోపంగా అనిపిస్తే అది మానసిక ఆరోగ్యం బలహీనంగా మారింది అనడానికి సంకేతం.

2. ఇతరుల కంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం

ప్రతి మనిషికి తమకంటూ ఓ ప్రత్యేకత ఉంటుంది. మిమ్మల్ని మీరు ఏ ఒక్కరితోను పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు గనక మిమ్మల్ని ఇతరులతో పోల్చుకునే అలవాటు ఉంటే మీ ఆత్మవిశ్వాసాన్ని మీరే చంపేసుకుంటున్నట్టు లెక్క.

- Advertisement -

3. అధిక భయం

కొంతమంది ప్రతి చిన్న విషయానికి తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. ఆ తర్వాత డిప్రెషన్ బారిన పడతారు. ఒకవేళ మీరు కూడా చిన్న విషయాలకే ఒత్తిడికి గురైతే వెంటనే సైకాలజిస్టులను సంప్రదించండి.

4. సరిగ్గా నిద్ర పట్టకపోవడం

శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవారు రాత్రిపూట ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా గాఢంగా నిద్రపోయి, ఉదయాన్నే ఫ్రెష్ గా నిద్ర లేస్తారు. కానీ కొంతమందికి మాత్రం ఎంత ప్రయత్నించినా సరిగ్గా నిద్ర పట్టదు. మరి కొంతమందికి నిద్రపోయాక మధ్యలోనే మెలకువ వచ్చేస్తుంది. ఇలా జరిగితే రోజంతా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. ప్రతిరోజూ ఇదే రిపీట్ అయితే మీ మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.

5. భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోవడం

కొంతమంది తమ ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టపడతారు. కానీ అది డిప్రెషన్ కు కారణం కావచ్చు. కాబట్టి మీకు నచ్చినట్టుగా మీరు ఉండండి. ఎవరికోసమో మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. పైన ప్రస్తావించిన లక్షణాలలో ఏవైనా మీలో కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే సైకాలజిస్ట్ దగ్గరకు వెళ్లడం మంచిది.

ఎక్కువగా ఒత్తిడిగా అన్పిస్తే గ్రీన్ టీని తాగండి. గ్రీన్ టీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. గ్రీన్ టీలో అమైనో ఆమ్లం ఉంటుంది, దీనిని ఎల్-థియానైన్ అంటారు. ఈ యాసిడ్ ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ హార్మోన్‌ను తగ్గిస్తుంది. ఇది పెరిగినప్పుడే ఒత్తిడికి గురవుతారు. అందుకే గ్రీన్ టీ తాగడం వల్ల ఒత్తిడి తగ్గి, శరీరానికి విశ్రాంతి లభిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు