Fitness Tips : ఫాస్టింగ్ టైంలో వ్యాయామం చేయొచ్చా?

Fitness Tips : ప్రస్తుతం జనాల్లో ఫిట్నెస్ పై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఫిట్ గా ఉండడానికి వ్యాయామం చేయడం, ఉపవాసం ఉండడం, డిఫరెంట్ డైట్ ఫాలో అవ్వడం వంటి పద్ధతులను ఫాలో అయిపోతున్నారు. అయితే ఏప్రిల్ 9న ఉగాది పర్వదినం నుంచి చైత్ర నవరాత్రులు మొదలయ్యాయి. ఏప్రిల్ 17 వరకు ఈ నవరాత్రులు కంటిన్యూ అవుతాయి. చైత్ర నవరాత్రి నుంచే హిందూ సంప్రదాయం ప్రకారం కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలోనే చాలామంది హిందువులు అమ్మవారిని పూజిస్తారు. పైగా ఈ తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు. అయితే రెగ్యులర్ గా వ్యాయామం చేసే వాళ్ళ మదిలో ఇలా ఉపవాసం చేస్తున్నప్పుడు కూడా ఎక్సర్సైజులు చేయొచ్చా? అనే ప్రశ్న మెదులుతుంది. మరి దీనికి సమాధానం ఏమిటంటే…

ఉపవాసం చేస్తున్న సమయంలో వ్యాయామం చేయడం కరెక్టేనా?

ఇదే ప్రశ్నను ఫిట్నెస్ నిపుణులను అడిగితే ఉపవాసం ఉన్న సమయంలో వ్యాయామం చేయడం అనేది వాళ్ళు తీసుకునే కేలరీలపై ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. ఎప్పటిలాగే సరిపడా కేలరీలకు తగ్గ ఆహరం తీసుకుంటే హ్యాపీగా వ్యాయామం చేసుకోవచ్చు. కానీ ఉపవాసం పేరుతో తక్కువ క్యాలరీలు ఉన్న ఫుడ్ తీసుకుంటే ఎక్కువ వ్యాయామం చేయకపోవడమే మంచిది అంటున్నారు.

ఉపవాసం ఉన్న సమయంలో నడవడం లేదా సాధారణ వ్యాయామం చేయవచ్చు. అంటే తేలికపాటి వ్యాయమాలు చేస్తే మంచిది. కానీ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు తీవ్రమైన వ్యాయామాలు చేయడం మంచిది కాదు. సాధారణంగా ఎక్సర్సైజు చేస్తే మన శరీరంలో ఉన్న కేలరీలు బర్న్ అవుతాయి. కానీ ఉపవాసం చేస్తున్న సమయంలో చాలా తక్కువ కేలరీలు ఉన్న ఆహారం లేదా ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. కాబట్టి త్వరగా అలసిపోయినట్టుగా అనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఉపవాసం ఉన్న సమయంలో తీవ్రమైన వ్యాయామాలు చేయకపోవడమే మంచిది.

- Advertisement -

అలాగే ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉండకూడదని గుర్తుపెట్టుకోండి. దీనివల్ల బలహీనత, అలసట, తలనొప్పి వంటి సమస్యలు మొదలవుతాయి. ఇక ఉపవాసం ఉన్నప్పటికీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం మర్చిపోవద్దు. తగినంతగా నీళ్లు తాగుతూ ఉండాలి. అంతేకాకుండా స్మూతీ, జ్యూస్, లస్సి వంటి పానీయాలను తీసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా అనారోగ్యంతో ఉండి, చికిత్స తీసుకుంటూ ఉంటే ఉపవాసం విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

వ్యాయామానికి ముందు కొంచెం తినండి –

ఫాస్టింగ్ ఉన్నప్పటికీ కొంతమంది అల్పాహారం లాంటివి తీసుకుంటారు. అయితే ఇలాంటి వారు వ్యాయామం చేయాలి అనుకుంటే… వ్యాయామానికి కొద్దిసేపటి ముందు ఏదైనా తినండి. పండ్లు లేదా కొన్ని డ్రై ఫ్రూట్స్ వంటివి తింటే శరీరానికి కొంత శక్తి వస్తుంది. సరిగ్గా వ్యాయామం చేయగలుగుతారు.

వ్యాయామం చేయాలా వద్దా లేదా ఎంత చేయాలి అనేది ప్రధానంగా మీ శరీరం ఎలా స్పందిస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. వ్యాయామం చేస్తున్నప్పుడు మీకు కళ్లు తిరగడం, కళ్లు తిరగడం లేదా అసౌకర్యంగా అనిపిస్తే, అక్కడితో ఆపివేయండి. అందరికి ఒకే ఫీలింగ్ ఉండదు. కొంతమంది ఉపవాసం ఉన్నప్పటికీ పని చేయగలుగుతారు. మరికొందరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ శరీరానికి తగ్గట్టుగా నడుచుకోండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు