Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి సెంటిమెంట్ గా మారిన నటుడు..కట్ చేస్తే..!

Pawan Kalyan.. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో అయినా.. హీరోయిన్ అయినా.. తమకు నచ్చిన వారికి తమ సినిమాలలో అవకాశం ఇస్తూ ఉంటారు.. అంతేకాదు ఆ స్టార్ హీరో లేదా స్టార్ హీరోయిన్ నటించే ప్రతి సినిమాలో కూడా వారు ఉండడం గమనార్హం.. ఒక్కొక్కసారి వారే వీరికి సెంటిమెంట్ గా కూడా మారుతూ ఉంటారు.. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ కు ఆలీ అంటే చాలా ఇష్టం.. ఒకప్పుడు ఆయన నటించిన ప్రతి సినిమాలో కూడా ఆలీ ఖచ్చితంగా ఉండేవారు.. ఆలీకి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రాధాన్యత అలాంటిది మరి.. అయితే వేరువేరు కారణాలవల్ల వైసీపీ లో ఆలీ చేరడంతో అటు పవన్ కళ్యాణ్ ఇటు ఆలీ మధ్య గ్యాప్ ఏర్పడింది.. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలలో కూడా ఆలీ నటించడం లేదు.

Pawan Kalyan:The actor who became sentimental to Pawan Kalyan..!
Pawan Kalyan:The actor who became sentimental to Pawan Kalyan..!

పవన్ కళ్యాణ్ కి సెంటిమెంట్ గా ప్రముఖ నటుడు..
అయితే పవన్ కళ్యాణ్ – అలీ మధ్య కాస్త గ్యాప్ రావడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలలో ఎక్కువగా ఒక నటులు కనిపిస్తున్న విషయం తెలిసిందే.. ఆయనే నర్రా శ్రీనివాస్.. ఈ పేరు చెబితే చాలామంది గుర్తు పట్టకపోవచ్చు కానీ ఆయన ఫోటో చూస్తే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు.. నర్రా శ్రీనివాస్ గతంలో పవన్ కళ్యాణ్ కు పిఎగా పనిచేశారు.. ఈ క్రమంలోని నర్రా శ్రీనివాస్ పై ఉన్న అభిమానం.. పైగా నర్రా శ్రీనివాస్ యాక్టింగ్ చేసే విధానం అద్భుతంగా ఉండడంతో పవన్ తన ప్రతి సినిమాలో కూడా అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సినిమాలలో నర్రా శ్రీనివాస్ అవకాశాలు దక్కించుకుంటూ ఇప్పుడు ఇతర హీరోల సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా దూసుకుపోతున్నారు..

నర్రా శ్రీనివాస్ కెరియర్..
ప్రస్తుతం తన కామెడీ టైమింగ్ తో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంటున్న ఈయనకు స్టార్ డైరెక్టర్లు అవకాశం ఇస్తే తన రేంజ్ ఏంటో నిరూపించుకోవడానికి సిద్ధం అంటున్నాడు.. అంతే కాదు ఈమధ్య రెమ్యునరేషన్ కూడా పెంచినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈయనకు పాపులారిటీ ఎక్కువగా లేదని చెప్పాలి .. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడమే నర్రా శ్రీనివాస్ కెరియర్ కు మైనస్ అయిందని చెప్పవచ్చు.. ఇకపోతే ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేయడం తనకు ఇష్టం లేదని.. కమెడియన్ అని పిలిపించుకోవడం కంటే ఆర్టిస్ట్ అని పిలిపించుకోవడమే తనకు ఇష్టం అంటూ తెలిపారు..

- Advertisement -

వారివల్లే ఈ కెరియర్..
నర్రా శ్రీనివాస్ ఇటీవల మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కి చాలా భాషల పైన పట్టు ఉంది.. ఆయన చాలా తెలివైన వారు అంటూ పొగడ్తలతో ముంచేశారు.. అలాగే తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణం పవన్ కళ్యాణ్ తో పాటు డైరెక్టర్ హరీష్ శంకర్ అని తెలిపారు.. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాలో తనకు అవకాశం ఇచ్చారట. ఆ సినిమా వల్లే తనకంటూ ఒక గుర్తింపు లభించింది అని.. వీరు ఛాన్స్ ఇవ్వడం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చారు.. ఇకపోతే నటనలో తనకు సీనియర్ ఎన్టీఆర్ స్ఫూర్తి అని, నర్రా శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ నటించిన ప్రతి సినిమాలో నర్రా శ్రీనివాస్ కనిపిస్తూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సెంటిమెంట్ గా మారిపోయారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు