Kanguva : కథ కిచిడి చేసేలా ఉన్నారే?

Kanguva : కోలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రాల్లో ‘కంగువ’ ఒకటి. కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో భారీ పాన్ ఇండియా విజ‌యంపై క‌న్నేశాడు. తెలుగులో శౌర్యం దరువు వంటి చిత్రాలను తీసిన శివ దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాని స్టూడియోగ్రీన్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా 200 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. టెక్నికాలిటీస్ ప‌రంగా ఇది హాలీవుడ్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం త‌గ్గ‌కుండా టీమ్ జాగ్ర‌త్త‌లు తీసుకుంద‌ని ఇంత‌కుముందు రిలీజైన టీజ‌ర్ చెబుతోంది. అయితే కంగువ ఫస్ట్ లుక్ వచ్చినప్పుడే సూర్య అభిమానుల్లో, సినీ ప్రేక్షకులలో ప్రకంపనలు సృష్టించింది. చిత్ర పరిశ్రమ వ‌ర్గాలు స‌హా అభిమానులు కామన్ ఆడియన్స్ అందరూ దీని గురించి చ‌ర్చించుకునేలా చేసింది. త‌మిళ‌ సూపర్ స్టార్ సూర్య ఒక తెగకు చెందిన వారియర్‌గా, బాబీ డియోల్ మరో తెగకు చెందిన విల‌న్‌గా కనిపించడం ఉత్కంఠను పెంచింది. ఇప్పుడు జ‌నంలో ఎప్పటికప్పుడు పెరుగుతున్న క్యూరియాసిటీని మ‌రింత‌ పెంచడానికి మేకర్స్ తమిళ నూతన సంవత్సరం సందర్భంగా కంగువ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసారు. అయితే ఈ పోస్టర్స్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయన్నది ఏ విధంగా నిజమో మరిన్ని అనుమానాల్ని కలిగిస్తుందని కూడా అనిపిస్తుంది.

ఫ్యాన్స్ కి లేనిపోని డౌట్లు..

తాజాగా తమిళ న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేసిన కంగువ(Kanguva) కొత్త పోస్టర్ మంచి నెక్ట్స్ లెవ‌ల్ ట్రీట్ అని కొందరు ఫ్యాన్స్ అంటుంటే, మరికొందరు ఫ్యాన్స్ ఫిక్షనల్ జానపద యాక్షన్ డ్రామా అనుకుంటే, తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ తో కాలానుగుణంగా తెరకెక్కించిన ఫ్లాష్ బ్యాక్ డ్రామా గా ఈ సినిమా ఉండబోతుందని అనిపిస్తుంది. దీనివల్ల సినిమా ఫ్లో దెబ్బ తింటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. పైగా సూర్య ని ఇంతకు ముందు చూపించిన ఆ వారియర్ గెటప్ సినిమాలో పూర్తి స్థాయిలోనే ఉంటే బాగుంటుందని అభిమానులు అనుకున్నారు. ఇక ఈ కొత్త పోస్ట‌ర్ లో సూర్య రెండు పాత్ర‌ల‌తో ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఇది రెండు కాలాల్లో ఒకే వ్య‌క్తి రూపాల‌ను ఆవిష్క‌రించింది. విభిన్న కాలాల్లోని, విభిన్న‌ వేష‌ధార‌ణ‌ల్లో సూర్య ఎంతో ప్ర‌త్యేకంగా క‌నిపిస్తున్నాడు. ఒక పాత్రలో శ‌క్తివంత‌మైన‌ గిరిజ‌నుడిగా, మ‌రొక పాత్ర‌లో మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ మెన్ గా క‌నిపిస్తున్నాడు. అయితే ఆధునిక స‌మాజంతో గిరిజ‌న స‌మాజానికి లింక్ ఏమిట‌న్న‌ది తెర‌పైనే చూడాల్సి ఉంటుంది. ఇక ఈ పోస్టర్ చూస్తుంటే భీక‌ర పోరాటాలు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతాయ‌ని ఈ పోస్ట‌ర్ హింట్ ఇస్తోంది.

తెలుగు వాళ్ళకి శక్తి వైబ్స్ ..

అయితే ఈ పోస్టర్ చూస్తుంటే తెలుగు సినీ అభిమానులకు ఎన్టీఆర్ శక్తి సినిమా గుర్తొస్తుంది. అప్పట్లో గత జన్మల కాన్సెప్ట్ తో వచ్చిన ఆ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో ఎన్టీఆర్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండగా, ఆ సినిమా ఏ రేంజ్ లో డిజాస్టర్ అయిందో తెలిసిందే. ఇక కంగువ దర్శకుడు శివ కమర్షియల్ గా మంచి డైరెక్టర్ అయినా, ఇలాంటి డిఫెరెంట్ సబ్జెక్టు ని హ్యాండిల్ చేయగలడా అని అనుమానం. పైగా అప్పట్లో రవితేజ తో చేసిన దరువు ఫాంటసీ సినిమాగా తీయగా, అన్ని సినిమాల కథలు మిక్స్ చేసినట్టు చేసి డిజాస్టర్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు కంగువ న కూడా బింబిసార లాంటి చిత్రాల కథల స్ఫూర్తి తో క్యారెక్టర్లు మాత్రమే బలంగా రాసుకుని కథని గాలికొదిలేస్తాడేమో అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా సినిమా రిలీజ్ అయ్యేదాకా ఏమి చెప్పలేం. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు