Varalaxmi Sarath Kumar : ఎలాంటి పాత్రకైనా సై అంటున్న వరూ..!

Varalaxmi Sarath Kumar : టాలెంటెడ్ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళ నటుడు శ‌ర‌త్ కుమార్ కుమార్తె అయిన వ‌ర‌ల‌క్ష్మి కొలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అవ్వాల‌ని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. కెరీర్ బిగినింగ్ లో మంచి పాత్రలతో బిజీ అయినా వరుస ప్లాపుల వల్ల ఆమెకు అవకాశాలు రాలేదు. ఆ మధ్య కన్నడలో కూడా హీరోయిన్ గా ట్రై చేసినా ఒకటి రెండు హిట్లు తప్ప మళ్ళీ అవకాశాలు రాలేదు. అయితే ఎప్పుడైతే పందెంకోడి 2 లో ప్రతినాయకి గా నటించిందో అప్పట్నుంచి అవకాశాలు క్యూ కట్టాయి. వరుసగా మూవీ కీ రోల్స్, లేదా విలన్ రోల్స్ వచ్చాయి. ఓవరాల్ గా కోలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ ఆమెని విల‌నీగా గుర్తించింది. అయితే ఈ అమ్మ‌డికి హీరోయిన్ గా కంటే ఎక్కువ గుర్తింపు ఆ త‌ర‌హా పాత్ర‌ల‌తోనే వ‌చ్చింద‌న్న‌ది కూడా వాస్త‌వం. ఇక టాలీవుడ్ లోనూ మొన్న‌టివ‌రకూ అదే త‌ర‌హా పాత్ర‌లు పోషించింది.

పాజిటివ్ కీ రోల్స్ తోనూ గుర్తింపు..

అయితే ఈ మధ్య కాలంలో తన పంథా మార్చిన‌ట్లు క‌నిపిస్తోంది. పాజిటివ్ కీ రోల్స్ మెయిన్ లీడ్స్ లోనూ న‌టిస్తోంది. అయితే ఇలాంటి పాత్ర‌లు ప్ర‌తీసారి రావ‌డం క‌ష్టం. ఇవ‌న్నీ వ‌ర‌ల‌క్ష్మి(Varalaxmi Sarath Kumar) ఇమేజ్ మీద ఆధార‌ప‌డి చేసే పాత్ర‌లు. ఫామ్ లో ఉన్నపుడు ఎలాంటి ఆఫర్లైనా బాగానే వస్తాయి. కానీ అవ‌కాశాలు త‌గ్గిన స‌మ‌యంలో ప‌రిస్థితి ఏంటి? అంటే వ‌ర‌ల‌క్ష్మి ఇప్పుడు అన్ని రకాల పాత్రలు చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. ఇక పై పాత్రకు నటనకు స్కోప్ ఉండే ఎలాంటి పాత్రలైనా చూడ్డానికి ఇంట్రస్ట్ చూపుతుందని తెలుస్తుంది. అంటే అక్క‌, వ‌దిన‌ అలాంటి పాత్రలైనా ఎలాంటి సమస్యా లేదంటోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ అలాంటి పాత్ర‌లు రాక‌పోవ‌డం వ‌ల్లే చేయ‌లేదు గానీ, మంచి కథాబలం ఉన్న సినిమాల్లో మంచి వ‌స్తే ఎందుకు వ‌ద‌లుకుంటాను. అలాంటి పాత్రలు చేయటానికి కూడా నాకు అభ్యంతరం లేదు. నా దృష్టిలో ఏదైనా పనే! అది చిన్నది కావచ్చు.. పెద్దది కావచ్చు.. ఎప్పుడూ నటిగా నా పరిధిని పెంచుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటా, భాష గురించి ఏ రోజు ఆలోచించ‌లేదు అంది.

ఎలాంటి పాత్రకైనా సై..

ఇక హనుమాన్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తరువాత హిందీ నుంచి చాలా అవ‌కాశాలు వస్తున్నాయని, కానీ ఏది ఆస‌క్తిగా అనిపించ‌క‌పోవ‌డంతో అక్క‌డ ఇంకా సినిమాలు చేయ‌లేదు’ అని వరలక్ష్మి అంది. ఇక ఇప్ప‌టికే ‘హ‌నుమాన్’ సినిమాలో తేజ కి అక్క పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. ఆ పాత్ర కూడా సినిమాకి ఎమోషనల్ గా మంచి ప్లస్ పాయింట్ అయింది. పాన్ ఇండియా సంచ‌ల‌న విజ‌యం సాధించిన ఆ సినిమా 300 కోట్ల వ‌సూళ్ల‌తో బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఇక వర‌ల‌క్ష్మి కెరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్ర‌మ‌దే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ప్ర‌స్తుతం వ‌ర‌ల‌క్ష్మి చేతిలో పెద్ద చిత్రాలే ఉన్నాయి. అయితే తెలుగులో స‌క్సెస్ అవ్వ‌డానికి కార‌ణంగా క్రాక్, ఇంకా వీర సింహారెడ్డి లాంటి సినిమాల్లో నెగిటివ్ రోల్స్ అనే చెప్పొచ్చు. ఇక ఇప్పుడు మాత్రం ఎలాంటి పాత్రలకైనా రెడీ అవుతుంది. అయితే అప్పట్లో గ్లామర్ షో చేసినా పనవ్వలేదు గాని, ఇప్పుడు కన్నెర్ర చేస్తే అవకాశాలు వచ్చి పడుతున్నాయి. అయితే అప్పుడప్పుడూ ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తూనే ఉంది. తాజాగా శబరి అనే చిత్రంలో మెయిన్ లీడ్ గా నటించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు