Varalakshmi sarathkumar : వివాహితుడిని పెళ్లి చేసుకుంటున్న వరలక్ష్మి శరత్ కుమార్.. విస్తుపోయే నిజాలు..!!

తమిళంలో స్టార్ యాక్టర్ గా పేరు సంపాదించిన శరత్ కుమార్ వారసురాలుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్.. ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే.. అయితే గత మూడు రోజుల నుంచి వరలక్ష్మి శరత్ కుమార్ కి సంబంధించి ఎన్నో విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. అయితే దాదాపుగా 40 ఏళ్ల వయసుకు చేరుకుంటున్న నేపథ్యంలో..ఇప్పుడు వివాహానికి సిద్ధమయ్యానని తెలియజేస్తూ సీక్రెట్ గా జరిగిన ఎంగేజ్మెంట్ ఫోటోలను కూడా షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.. అయితే ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకోబోయే వరుడు గురించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి..

రెండో పెళ్లి వాడితో వరలక్ష్మి పెళ్లి..
ముఖ్యంగా వరలక్ష్మి చేసుకోబోయే వ్యక్తి రెండవ పెళ్లి వాడన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవలే వరలక్ష్మి శరత్ కుమార్ తను చేసుకోబోయే వాడి ఫోటోలను షేర్ చేయడంతో అతని బ్యాగ్రౌండ్ ఏంటా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు.. అయితే చూడడానికి ఆ వ్యక్తి విలన్ గా ఉన్నప్పటికీ అతని గురించి ఆరా తీయగా.. అతని పేరు నికోలయ్ అని.. ఇతనికి సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు కూడా వినిపిస్తున్నాయి.

- Advertisement -

నికోలయ్ బ్యాక్ గ్రౌండ్..
నికోలయ్ కు గతంలోనే వివాహమయిందని.. ఈయన మాజీ భార్య పేరు కవితా సచ్ దేవ్ అని.. ఆమె ఒక మోడల్ అన్నట్లుగా సమాచారం .. ఫ్యాషన్ రంగంలో ఆమె బాగా కొనసాగిందని.. కానీ కొన్ని కారణాల చేత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం విన్న వరలక్ష్మి శరత్ కుమార్ అభిమానులు ఒకసారిగా షాక్ అవుతున్నారు..ఈమె చేసుకోబోయేది పెళ్లయినోడినా.. అలాంటి వ్యక్తికి రెండో భార్యగా వెళ్ళబోతోందా అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

వరలక్ష్మి శరత్ కుమార్ కెరియర్..
వరలక్ష్మి శరత్ కుమార్ మొదట హీరోయిన్గా తన కెరీర్ ని మొదలుపెట్టిన సక్సెస్ కాలేక పోయింది. కానీ ఆ తర్వాత విలన్ గా కెరియర్ ఎంచుకొని భారీ క్రేజ్ అందుకుంది. తెలుగులో , తమిళంలో లేడీ విలన్ గా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. జిమ్ వర్క్ అవుట్లతో కష్టపడి మరీ బరువును తగ్గించుకుంది. ఇలాంటి సమయంలోనే తన పాత్రల సెలక్షన్స్ ని కూడా వైవిధ్యంగా ఎంచుకుంటూ భారీ క్రేజ్ ను అందుకున్నది.

వరలక్ష్మీ ప్రేమాయణం..
గతంలో హీరో విశాల్ తో ప్రేమాయణం నడిపిందని.. శరత్ కుమార్ వల్ల వీరిద్దరు విడిపోయారనే ప్రచారం కూడా జరిగింది.. గడిచిన కొన్ని నెలల క్రితం హీరో శింబు తో పెళ్లికి సిద్ధమయ్యిందని రూమర్స్ కూడా వినిపించాయి.. అయితే ఈ రూమర్లన్నిటికీ చెక్ పెడుతూ ఈ ముద్దుగుమ్మ తన బాయ్ ఫ్రెండ్ నికోలయ్ సచ్ దేవ్ ఆర్ట్ గ్యాలరీ ఓనర్ తో ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేసింది.. దాదాపుగా వీరిద్దరు 14 ఏళ్ల నుంచి ఒకరికొకరు తెలుసు అన్నట్లు సమాచారం..

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు