Malayalam Industry : మోస్ట్ ప్రాఫిటబుల్ ఇండస్ట్రీగా ఇండియా ని షేక్ చేస్తున్నారుగా!

Malayalam Industry : గత కొన్నాళ్లుగా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, శాండిల్ వుడ్, ఇతర ఇండస్ట్రీలలో సరైన హిట్లు లేక నెట్టుకొస్తున్నారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ లో ఇప్పటివరకు ఓ నాలుగు స్ట్రయిట్ సినిమాలు మాత్రమే బ్రేక్ ఈవెన్ అయితే అందులో రెండు మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ అయి 100 కోట్ల వసూళ్లు సాధించాయి. ఇదిలా ఉంచితే ఇతర ఇండస్ట్రీలతో పోల్చితే ఇండియా లో చిన్న ఇండస్ట్రీలుగా పేరున్నవి కన్నడ ఇండస్ట్రీ మరియు మలయాళ ఇండస్ట్రీ. ఇక కన్నడ ఇండస్ట్రీ
నుండి కొన్నాళ్ల క్రితం వచ్చిన కేజిఎఫ్, కాంతార సిరీస్ లు సంచలనాలు సృష్టించాయి. కానీ మలయాళ ఇండస్ట్రీ మాత్రం చాలా టైంగా తమ మార్కెట్ ను అంతగా పెంచుకోలేక పోయింది. ఏడాది కింద వరకూ చూసుకున్నా కూడా మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే 100 కోట్ల సినిమాలు మలయాళం ఇండస్ట్రీలో చాలా తక్కువ. ఏడాది ముందు వరకు చూసుకుంటే అక్కడ వంద కోట్ల సినిమాలను చాలా తక్కువ. 2016 టైంలో మోహన్ లాల్ పులి మురుగన్ మూవీ తొలి సారిగా 100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టింది.

మూడు నెలల్లో 4 వంద కోట్ల సినిమాలతో రచ్చ..

ఇక మలయాళంలో ఎనిమిదేళ్ల కింద పులిమురుగన్ తొలిసారి వంద కోట్ల వసూళ్ళని అందుకోగా, ఆ తర్వాత 2019 టైంలో ‘లూసిఫర్’, లాస్ట్ ఇయర్ 2023 లో “2018” మూవీ వంద కోట్ల వసూళ్ళని అందుకున్నాయి. కానీ 2024 మలయాళ ఇండస్ట్రీ కి గోల్డెన్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మలయాళ ఇండస్ట్రీకి ఓ రేంజ్ లో కలిసి వచ్చిందని చెప్పాలి. మొదటి నెల పెద్దగా జోరు చూపించలేదు కానీ, ఫిబ్రవరి నుండి ఇండియా మొత్తాన్ని మలయాళ ఇండస్ట్రీ షేక్ చేస్తుందనే చెప్పాలి. బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల సినిమాలతో అన్ సీజన్ టైంలో రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు ఆల్ మోస్ట్ 4 సినిమాలు 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అందుకున్నాయి. వరుసగా ప్రేమలు, మంజుమ్మేల్ బాయ్స్, ఆడుజీవితం సినిమాలు బ్యాక్ టు బ్యాక్ 100 కోట్లతో దుమ్ము లేపితే, రీసెంట్ గా ఫహాద్ ఫాజిల్ నటించిన ఆవేశం మూవీ కూడా ఇప్పుడు ఆల్ మోస్ట్ 100 కోట్లకు చేరువ అయింది. దాంతో ఇన్నేళ్ళ టైం లో 3 100 కోట్ల సినిమాలను సొంతం చేసుకున్నమలయాళ ఇండస్ట్రీ, ఇప్పుడు కేవలం ఒక్క మూడు నెలల టైంకే 4 కొత్త 100 కోట్ల సినిమాలను తమ ఖాతాలో వేసుకుంది.

మోస్ట్ ప్రాఫిటబుల్ ఇండస్ట్రీగా..

ఇక మలయాళంలో (Malayalam Industry) ఈ నాలుగు వంద కోట్ల సినిమాలే కాదు, మధ్యలో వచ్చిన భ్రమయుగం లాంటి సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అయితే ఈ అన్ని చిత్రాలు కూడా చాలా లౌ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాలు కావడం విశేషం. అందుకే బయ్యర్లు భారీ లాభాలు అందుకున్నారు. ఇక మంజుమ్మేల్ బాయ్స్ అయితే ఏకంగా 200 కోట్ల వసూళ్ళని అందుకుని ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఈ ఇయర్ లో మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ తో ఇండియాని షేక్ చేస్తున్నారు మలయాళం ఇండస్ట్రీ మేకర్స్. చిన్న బడ్జెట్ తో, చిన్న బిజినెస్ తో డిస్ట్రిబ్యూటర్లకు కూడా లాభాల్లోకి తీసుకొస్తున్నారు మలయాళ మేకర్స్. ఇక ఈ సంవత్సరం రానున్న ఇయర్ ఎండ్ టైంకి ఇంకా ఎన్ని సినిమాలు వంద కోట్ల క్లబ్ లో యాడ్ అవుతాయో చూడాలి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు