High Rated Telugu Movies on OTT : రేటింగ్ లో ఓటిటిని షేక్ చేసిన తెలుగు సినిమాల లిస్ట్… డోంట్ మిస్

High Rated Telugu Movies on OTT : ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో టాలీవుడ్ హవా నడుస్తుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం పాన్ వరల్డ్ దిశగా దూసుకెళ్తున్న తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటిదాకా తెరకెక్కిన సినిమాల్లో ఎన్నో ఆణిముత్యాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓటిటిలో తెలుగు మూవీ లవర్స్ అస్సలు మిస్ కాకుండా చూడాల్సిన అత్యధిక రేటింగ్ పొందిన ఏడు బెస్ట్ తెలుగు సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

1. కేరాఫ్ కంచరపాలెం

వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన కేరాఫ్ కంచరపాలెం మూవీ 4 జంటల ప్రేమ కథల నేపథ్యంలో సాగే ఆంథాలజీ మూవీ. ఈ మూవీకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం కేరాఫ్ కంచరపాలెం మూవీ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతుంది.

2. జెర్సీ

నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన జెర్సీ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. పర్సనల్ లైఫ్ లో సమస్యల కారణంగా క్రికెట్ ను వదిలేసిన అర్జున్ 30 ఏళ్ల చివర్లో తిరిగి క్రికెట్లోకి అడుగు పెట్టి, తను కన్న కలను ఎలా నెరవేర్చుకున్నాడు అనేదే స్టోరీ. ఈ మూవీ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

- Advertisement -

3. సీతారామం

ఈ మూవీ లండన్ నుంచి తిరిగి వచ్చిన పాకిస్తానీ విద్యార్థినికి దొరికిన ఉత్తరం, అందులో ఉన్న హింట్ ప్రకారం ఆమె రామ్, సీతల మధ్య ఏం జరిగిందో కనుగొనే ప్రయత్నమే సీతారామం. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ మూవీకి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది.

4. మహానటి

అలనాటి మహానటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన మూవీ మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో సావిత్రిగా కీర్తి సురేష్ నటించి మెప్పించింది. ఇక ఈ మూవీలో సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీ ప్రైమ్ వీడియోతో పాటు ఎంఎక్స్ ప్లేయర్లో స్ట్రీమింగ్ అవుతోంది.

5. శంకరాభరణం

శాస్త్రీయ సంగీత మాస్టారు శంకర శాస్త్రి, వేశ్యల కుటుంబానికి చెందిన మహిళ అయిన తులసి మధ్య ఉన్న అరుదైన బంధం చుట్టూ తిరిగే కథే ఈ మూవీ. శంకరాభరణం మూవీ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

6. మాయాబజార్

మహాభారతం ఆధారంగా తెరకెక్కిన మూవీ మాయాబజార్. ఈ మూవీలో అభిమన్యుడు, శశిరేఖలను శ్రీకృష్ణుడు ఎలా కలిపాడు అనే కథను తెరపై చూపించారు. ఇందులో ఎన్టీ రామారావు హీరోగా నటించగా, అలనాటి దిగ్గజ నటులు ఎస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, గుమ్మడి, రేలంగి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

7. అహనా పెళ్ళంట

జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ టాలీవుడ్ లోనే ఎవర్ గ్రీన్ మూవీస్ లో ఒకటి అని చెప్పొచ్చు. ఈ కామెడీ మూవీలో రాజేంద్ర ప్రసాద్, రజిని ప్రధాన పాత్రలు పోషించారు. పారిశ్రామికవేత్త సత్యనారాయణ ఏకైక కుమారుడు కృష్ణమూర్తి పద్మను ప్రేమిస్తాడు. కానీ దానికి ఒప్పుకోని సత్యనారాయణ తండ్రి పేరును ఉపయోగించకుండా అత్యంత పిసినారి అయిన పద్మ తండ్రి లక్ష్మీపతిని పెళ్లికి ఒప్పించాలని కొడుకుకు కండిషన్ పెడతారు. ఈ నేపథ్యంలో వచ్చే కామెడీ సన్నివేశాలతో కడుపుబ్బా నవ్వుకోవచ్చు. ఈ మూవీని యూట్యూబ్ లో చూడొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు