CoolieTeaserTalk : రజినీ ఐ ఫీస్ట్.. పక్కా లోకి మార్క్ తో..

CoolieTeaserTalk : సూపర్ స్టార్ రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ కాంబోలో తలైవర్171 సినిమా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై సౌత్ ఇండియా వ్యాప్తంగా ఓ రేంజ్ లో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి రజినీకాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా అభిమానులకు వింటేజ్ లుక్ ను రజినీకాంత్ ను గుర్తు చేశారు. అయితే ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఈ సినిమా టైటిల్ తో సహా టీజర్ రిలీజ్ అయిపొయింది. రజిని లోకి కాంబోలో వస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కి “కూలీ” అని క్యాచీ మాస్ టైటిల్ ని పెట్టడం జరిగింది. ఇక కాసేపటికిందే రిలీజ్ కూలీ టీజర్ యూట్యూబ్ లో రచ్చ చేస్తుంది. రిలీజ్ అయిన నిమిషాల వ్యవధిలోనే లక్షల్లో లైక్స్ సాధిస్తూ దూసుకుపోతుంది.

వింటేజ్ మాస్ లుక్ తో రజిని…

ఇక రజినీకాంత్ కూలీ టీజర్ కాసేపటికిందే రిలీజ్ అవగా టీజర్ మూడు నిమిషాల నిడివితో ఉండడం విశేషం. టీజర్ అలా మొదలవుతూనే గ్యాంగ్ స్టర్ ల లొకేషన్లో కి హీరో రావడంతో స్టార్ట్ అవుతుంది. ఇక టీజర్ ద్వారా బంగారం స్మగ్లర్ల ముఠా కి సంబంధించిన నేపథ్యంతో కథ నడుస్తుందని తెలిసిపోతుంది. ఇక గోల్డ్ స్మగ్లింగ్ పనులు జరుగుతుండగా, విలన్ల షెడ్డుకి రజిని తన స్టయిల్లో నడుచుకుంటూ వస్తూ, రౌడీలను కొడతాడు. ఇక ఆ సీన్ ని సాలిడ్‌ పంచ్‌ డైలాగ్స్‌తో ఫైట్‌ సీక్వెన్స్‌ని ఇంట్రెస్టింగ్‌గా డిజైన్‌ చేయగా, దానికి తగ్గట్టు అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కట్ కి చాలా యాప్ట్ గా ఉంది. చిత్రం యొక్క కథాంశం గురించి యూనిట్ ఎలాంటి కీలక వివరాలను వెల్లడించలేదు, కానీ లోకి స్టైల్ లో ఒక గ్యాంగ్‌స్టర్ స్మగ్లింగ్ డ్రామా ఉందని అయితే తెలుస్తుంది. బహుశా ఈ సినిమాని కూడా తన యూనివర్స్ కి లింక్ చేసినా చేయొచ్చని టీజర్ చూస్తుంటే అనిపిస్తుంది.

పాన్ ఇండియా తారాగణంతో..

ఇదిలా ఉండగా ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ దాకా స్టార్స్ ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్నారట. ప్రముఖ నటుడు మైక్ మోహన్ విలన్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అలాగే మలయాళ స్టార్ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్, తమిళ్ నుండి రాఘవ లారెన్స్, విజయ్ సేతుపతి, బాలీవుడ్ నుండి రణవీర్ సింగ్ కూడా కీలక పాత్రలో నటించనున్నాడట. ఇక తాజాగా టాలీవుడ్ నుండి కింగ్ నాగార్జున కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేవరకు డిసైడ్ చేయలేము. ఇక దాదాపు 250 నుండి 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘కూలీ’ మూవీ పాన్ ఇండియా భాషలతో పాటు, జాపనీస్ వంటి భాషల్లో కూడా విడుదల కానుందట. ఇక ఈ సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటు పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు