Thalaivar171 : రజినీ- లోకి మూవీ టైటిల్ లీక్.. ఒకరోజు ముందే..!

Thalaivar171 : సూపర్ స్టార్ రజినీకాంత్ ఎక్కడా తగ్గడం లేదు. ఒకేసారి రెండు సినిమాల షూటింగ్ లో పాల్గొంటూ యంగ్ హీరోల రేంజ్ లో దూసుకుపోతున్నారు. అయితే రజినీకాంత్ హీరోగా తన 171వ సినిమాను లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై సౌత్ ఇండియా వ్యాప్తంగా ఓ రేంజ్ లో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి రజినీకాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా అభిమానులకు వింటేజ్ లుక్ ను రజినీకాంత్ ను గుర్తు చేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తున్నట్టు తెలుస్తుంది. కోలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్నారట. ఈ సినిమాలో ప్రముఖ నటుడు మైక్ మోహన్ విలన్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇక మలయాళ స్టార్ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్, అలాగే కోలీవుడ్ నుండి విజయ్ సేతుపతి ఈ సినిమాలో భాగం కానుండగా, బాలీవుడ్ నుండి రణవీర్ సింగ్ కూడా ప్రత్యేక అతిథి పాత్రలో నటించనున్నాడట. అలాగే రాఘవ లారెన్స్ కూడా కీలక పాత్ర చేయనున్నాడు. ఇక తాజాగా తలైవర్171 (Thalaivar171) లో కింగ్ నాగార్జున కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

టైటిల్ ఒకరోజు ముందే లీక్..

అయితే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న రజినీకాంత్ లోకేష్ కానగరాజ్ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ ని కూడా రిలీజ్ ని ఏప్రిల్ 22 న చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ టీజర్ తో పాటే టైటిల్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా రజినీకాంత్ మూవీ టైటిల్ లీక్ అయిపొయింది. రజిని లోకి కాంబోలో వస్తున్న ఈ ఆక్షన్ మూవీ కి “తంగం” అనే టైటిల్ ని ఫిక్స్ చేసారని సమాచారం. ఇక ఉప శీర్షిక గా గోల్డ్ అని కూడా పెట్టారట. ఇక రేపు విడుదల కాబోయే ఈ సినిమా టీజర్ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొని ఉండగా, టీజర్ పలు రికార్డులు బద్దలు కొడుతుందని సమాచారం.

పాన్ ఇండియా నుండి పాన్ వరల్డ్ రేంజ్ లో..

ఇక రజిని కాంత్ లోకేష్ కానగరాజ్ కాంబో మూవీ పై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు ఉండగా, తమిళ, తెలుగు, కన్నడ మలయాళం తో పాటు హిందీ లోనూ రిలీజ్ కానుండగా, రిలీజ్ టైం నాటికి జాపనీస్, కొరియన్, చైనీస్ లో కూడా డబ్ చేస్తారట. ఇక రజిని కి జపాన్ లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి తెలిసిందే. దాదాపు 300 కొట్లకి పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజినీకాంత్ కబాలి సినిమా తర్వాత అంతటి స్టైలిష్ గా కనిపించబోతున్నారట. ఇక ఈ మూవీ నుండి లీక్ అవుతున్న స్టిల్స్ కూడా అలాగే ఉండగా, మూవీ ప్రమోషన్ స్టిల్స్ కూడా కబాలి ని తలపిస్తున్నాయి. ఏది ఏమైనా రేపు టీజర్ వచ్చాక ఓ రేంజ్ లో రజిని ఫ్యాన్స్ రచ్చ చేయడం ఖాయమని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు