Samantha: స్టార్ హీరోల రికార్డ్ నే బ్రేక్ చేసిన సామ్.. గ్రేట్ గురూ..!

Samantha.. ఒకప్పుడు షాపింగ్ మాల్స్ లో పనిచేస్తూ పొట్టు నింపుకున్న సమంత…ఆ తర్వాత పలు యాడ్స్ లో కూడా చేసి దర్శకుల కంట పడింది.. నేడు వందల కోట్ల పారితోషకం తీసుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది ఈ ముద్దుగుమ్మ.. సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలో తమిళంలో కొన్ని సినిమాలు చేసిన ఈమె తెలుగులో” ఏమాయ చేసావే” అనే సినిమా ద్వారా పరిచయమై మొదటి సినిమాతోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. ఇక ఈ సినిమాల్లో నటించిన నాగచైతన్యను ప్రేమించిన ఈమె.. దాదాపు 7 సంవత్సరాల ప్రేమాయణం తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.. అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వివాహమైన నాలుగేళ్లకే విడాకులు తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు..

Samantha:Sam who broke the record of star heroes.. Great guru..!
Samantha:Sam who broke the record of star heroes.. Great guru..!

విమర్శించిన వారే ప్రశంసలు..

విడాకుల సమయంలో చాలామంది సమంతా పై నెగిటివ్ ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక చివరికి ఈమె పోలీసులను కూడా ఆశ్రయించింది. అంతేకాదు ఈమె మయోసైటిస్ అనే వ్యాధితో కూడా బాధపడింది. ఈ వ్యాధి చికిత్స నిమిత్తం అమెరికాకు వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి.. మళ్లీ ఇండియా తిరిగివచ్చి రెండు మూడు చిత్రాలలో నటించినా.. అవి కూడా డిజాస్టర్ గానే నిలిచాయి.. అయితే గత రెండేళ్ల క్రితం పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించి మెప్పించింది.. తరవాత ఈమె చేసిన ఏ సినిమా కూడా ఈమెకు విజయాన్ని అందివ్వలేదు. చివరిగా సిటాడెల్ అనే హిందీ వెబ్ సిరీస్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించింది.. ఇదిలా ఉండగా తాజాగా సమంత స్టార్ హీరోల రికార్డులని బ్రేక్ చేసినట్టు తెలుస్తోంది.. ఈ రికార్డుతో విమర్శించిన వారి నోటి నుంచే ప్రశంసలు అందుకుంది. మరి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

అల్లు అర్జున్ , మహేష్ రికార్డులనే బ్రేక్ చేసిన సమంత..

తాజాగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి కుర్చీ మడత పెట్టే సాంగ్ 200 మిలియన్ వ్యూస్ సాధించగా.. మహేష్, శ్రీ లీలా స్టెప్పులకు థియేటర్స్ ఏ రేంజ్ లో దద్దరిల్లాయో అందరికీ తెలిసిందే.. యూట్యూబ్ లో కూడా ఈ పాట దాదాపు 20 కోట్ల వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది.. అయితే ఇప్పటికే 200 మిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్స్ అంటూ కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. వాటిలో ఫాస్ట్గా 200 మిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్స్ అంటూ మరో రికార్డును ఇప్పుడు తాజాగా బయటకు తీశారు.. ఇక అందులో భాగంగానే వీరి రికార్డులను బ్రేక్ చేసింది సమంత.. మహేష్ బాబు, శ్రీ లీలా కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం సినిమాలోని “కుర్చీ మడత పెట్టి “సాంగ్ 200 మిలియన్ వ్యూస్ సాధించడానికి 78 రోజులు పట్టగా.. పుష్ప సినిమాలోని సమంత స్పెషల్ సాంగ్ “ఉ అంటావా ఉ ఊ అంటావా” పాట కేవలం 68 రోజుల్లోనే 200 మిలియన్ వ్యూస్ సాధించింది అంటూ మరో వార్త తీరపైకి వచ్చింది.. ఇకపోతే అల్లు అర్జున్ – పూజ హెగ్డే కాంబినేషన్లో వచ్చిన “బుట్ట బొమ్మ” పాట 200 మిలియన్ న్యూస్ రాబట్టడానికి 95 రోజులు పట్టినట్లు సమాచారం.. ఇక ఈ లెక్కను చూసుకుంటే ఇలా ఫాస్ట్ గా 200 మిలియన్ వ్యూస్ సాధించిన పాటలలో సమంత “ఉ అంటావా” పాట మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని ఈ స్టార్ హీరోల రికార్డులను బ్రేక్ చేసింది మొత్తానికైతే అటు అల్లు అర్జున్ , ఇటు మహేష్ బాబు రికార్డులను బ్రేక్ చేసి నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది సమంత. ఈ విషయం తెలిసి నెటిజెన్స్ సమంత గ్రేట్ గురూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు